Omicron | దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ..!-insacog confirms presence of ba 4 ba 5 subvariants of omicron ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Omicron | దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ..!

Omicron | దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ..!

HT Telugu Desk HT Telugu
May 22, 2022 09:58 PM IST

ఒమిక్రాన్​ సబ్​వేరింట్లైన బీఏ.4, బీఏ.5 దేశంలో ఉన్నట్టు ఐఎన్​ఎస్​ఏసీఓజీ నిర్ధరించింది. తమిళనాడు, తెలంగాణల్లో కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది.

<p>దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ</p>
దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ

Omicron Sub variant | దేశంలోకి బీఏ.4, బీఏ.5 కొవిడ్​ వేరియంట్లు ప్రవేశించినట్టు ఐఎన్​ఎస్​ఏసీఓజీ నిర్ధరించింది. తమిళనాడు, తెలంగాణల్లో ఈ కేసులు వెలుగు చూసినట్టు స్పష్టం చేసింది. ఈ రెండు.. ఒమిక్రాన్​ సబ్​వేరియంట్లు అని పేర్కొంది.

తమిళనాడుకు చెందిన 19ఏళ్ల యువతిలో ఒమిక్రాన్​ బీఏ.4 సబ్​ వేరియంట్​ను గుర్తించారు. ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కాగా ఆమె కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకుంది.

తెలంగాణలోని 80ఏళ్ల వృద్ధుడికి బీఏ.5 పాజిటివ్​గా తేలింది. ఆయనకు కూడా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. ఆయనకు రెండు డోసుల టీకా ముందే ఇచ్చారు. ఎక్కడికి ప్రయాణించకపోయినా.. రోగికి ఈ కొత్త రకం వేరియంట్​ సోకడం ఆందోళకరంగా మారింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. కాంటాక్ట్​ ట్రేసింగ్​ చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వివరాలు సేకరిస్తోంది.

ఈ రెండు వేరియంట్లు.. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే ఈ రెండు.. అంత ప్రమాదకరం కాదని తేలింది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్