Covid | ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లతో కొత్త 'వేవ్​' తప్పదు..!-omicron sub variants evade antibodies from earlier infections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid | ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లతో కొత్త 'వేవ్​' తప్పదు..!

Covid | ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లతో కొత్త 'వేవ్​' తప్పదు..!

HT Telugu Desk HT Telugu
May 01, 2022 05:16 PM IST

ఒమిక్రాన్​ కొత్త సబ్​ వేరియంట్ల​తో కొత్త వేవ్​ వచ్చే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బీఏ.4, బీఏ.5 వేరియంట్లతో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు.

ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లతో కొత్త వేవ్​…?
ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్లతో కొత్త వేవ్​…? (AP)

Omicron sub variants | కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్​ సబ్​వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. యాంటీబాడీల(ఒకసారి ఒమిక్రాన్​ సోకితే) నుంచి ఈ వేరియంట్లు తప్పించుకునే ప్రమాదం ఉందని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీటి వల్ల కొవిడ్​ కొత్త వేవ్​ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. టీకాలు తీసుకున్న వారిలో వీటి ప్రభావం తక్కువగానే ఉంటుందని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​కు చెందిన బీఏ.4, బీఏ.5 సబ్​ వేరియంట్లతో ఉత్పన్నమవుతున్న పరిస్థితులను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) గత నెల నుంచి పర్యవేక్షిస్తోంది. కాగా.. వీటిపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఒమిక్రాన్​ బారినపడిన 39మంది రక్తనమూనాలను సేకరించారు. వీరిలో 15మంది టీకాలు తీసుకున్నారు. 24మంది వ్యాక్సిన్లు తీసుకోలేదు. టీకాలు తీసుకున్న వారిలో అధిక రక్షణ ఉందని తేలింది. కానీ.. వారిలో రక్తం మాత్రం తగ్గిపోయింది.

ఒమిక్రాన్​ అసలు వేరియంట్​ బీఏ.1తో పోల్చుకుంటే.. టీకాలు తీసుకోని ప్రజలకు బీఏ.4, బీఏ.5 సోకితే.. వారిలో యాంటీబాడులు దారుణంగా పడిపోయాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిణామాలతో దక్షిణాఫ్రికాలో 5వ వేవ్​.. ఊహించిన దానికన్నా వేగంగా వచ్చే అవకాశం ఉంది. బీఏ.4, బీఏ.5 సబ్​ వేరియంట్లకు చెందిన కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం.

దక్షిణాఫ్రికాలోని 60మిలియన్​ మందిలో ఇప్పటివరకు 30శాతం మంది మాత్రమే టీకాలు తీసుకోవడం గమనార్హం. ఫలితంగా వైద్యులు, ప్రజల్లో తీవ్రస్థాయి భయాందోళనలు నెలకొన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్