Omicron variant | హైదరాబాద్‌లో బీఏ4 తొలి కేసు నమోదు.. ఇండియాలోనే ఇది మెుదటిది-ba 4 omicron variant first case reported in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Omicron Variant | హైదరాబాద్‌లో బీఏ4 తొలి కేసు నమోదు.. ఇండియాలోనే ఇది మెుదటిది

Omicron variant | హైదరాబాద్‌లో బీఏ4 తొలి కేసు నమోదు.. ఇండియాలోనే ఇది మెుదటిది

HT Telugu Desk HT Telugu
May 19, 2022 02:34 PM IST

ఇండియాలో BA4 ఓమిక్రాన్ వేరియంట్ మెుదటి కేసు నమోదైంది. అదికూడా హైదరాబాద్ లోనే నమోదైనట్టుగా గుర్తించారు.

<p>బీఏ 4 మెుదటి కేసు నమోదు</p>
బీఏ 4 మెుదటి కేసు నమోదు

కరోనా తగ్గుముఖం పడినట్టుగా కనిపిస్తున్నా.. దానికి సంబంధించిన వేరియంట్లు.. ఏదో ఒక ప్రాంతంలో నమోదైనట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ బీఏ4 హైదరాబాద్ లోనే నమోదైంది. మే 9న హైదరాబాద్‌లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి నమూనాలు సేకరించారు. BA4 ఓమిక్రాన్ వేరియంట్‌ను ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. జనవరి నుంచి.. ఓమిక్రాన్ వేరియంట్స్ BA4, BA5 దక్షిణాఫ్రికాలో నమోదవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ దేశంలో కొవిడ్ ఐదో వేవ్ కూడా కొనసాగుతోంది. ఇండియాలో Omicron BA4 వేరియంట్ నమోదుకావడం ఇదే మొదటిసారి .

Omicron BA 4, BA 5 వేరియంట్‌లను మొదటగా దక్షిణాఫ్రికా ఆరోగ్య అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి.. దక్షిణాఫ్రికా, యుఎస్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్‌, డెన్మార్క్ మొదలైన దేశాలలో ఈ రెండు వేరియంట్స్ నమోదయ్యాయి. పరిశోధనా సంస్థల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. BA4 మరియు BA5 ఉప-వేరియంట్‌లు ఒమిక్రాన్ యొక్క అసలు వెర్షన్ నుండి చాలా భిన్నంగా ఉంటాయి. దీని కారణంగా అవి మునుపటి ఇన్‌ఫెక్షన్ నుంచి ఉత్పన్నమయ్యే రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలోని రాష్ట్రాలలో BA2 వేరియంట్ ఉంది. తాజాగా హైదరాబాద్ లో బీఏ4 తొలి కేసు నమోదైంది.

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ మొత్తం వ్యాప్తి చెంది.. పలు సబ్-వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతోంది. అలాగే.. దీని ఉపవర్గాలతో హైబ్రిడ్ వేరియంట్ XE ఏర్పడింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన మరో రెండు కొత్త ఉపవర్గాలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశంలో జీనోమ్ సీక్వెన్స్‌ ల్యాబొరేటీరీల నిర్వాహకులు తులియో డే ఒలివెరా వెల్లడించారు. వాటికే.. BA.4, BA.5 అనే పేర్లను సూచించారు. ఈ ఉపవర్గాలు దక్షిణాఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణం కాలేదని, అనేక దేశాల నుంచి వచ్చిన నమూనాలలో వీటిని కనుగొన్నట్టుగా ప్రకటించారు.

కొత్తరకం ఒమిక్రాన్ ఉపవర్గాలు BA.4, BA.5 దక్షిణాఫ్రికా, బోట్సవానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. కానీ తాజాగా ఇండియాలోకి కూడా ప్రవేశించింది. దక్షిణాఫ్రికా కేసులలో కొత్త సబ్-వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. అయితే కేసులు, ఆస్పత్రుల్లో చేరిక, మరణాలు పెద్దగా నమోదుకానందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రపంచం మొత్తం వ్యాప్తిచెందిన ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటిసారి దక్షిణాఫ్రికా, బొట్సవానాలో గతేడాది గుర్తించారు. ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో కేసులు భారీగా పెరుగుదలకు కారణమైంది. కేసుల సంఖ్య భారీగా ఉన్నా డెల్టాతో పోల్చితే ఆస్పత్రిలో చేరడం, మరణాలు తక్కువగానే ఉన్నాయి.

Whats_app_banner