తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nashik Bus Fire Accident : బస్సులో అగ్నిప్రమాదం.. 10మంది దుర్మరణం!

Nashik bus fire accident : బస్సులో అగ్నిప్రమాదం.. 10మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

08 October 2022, 7:19 IST

    • Maharashtra bus accident : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10మంది మరణించారు. బస్సులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సు
అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సు

అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సు

Nashik bus fire accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నాసిక్​లోని ఔరంగాబాద్​ రోడ్డులో ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుగా ఉన్న ట్రక్​ను బస్సు ఢీకొట్టినట్టు సమాచారం. ఆ తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. చివరికి ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించినట్టు వెల్లడించాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు.

క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు నాసిక్​లోని ఆసుపత్రికి తరలించారు.