తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 23మంది మృతి!

Boat accident : ఘోర పడవ ప్రమాదం.. 23మంది మృతి!

Sharath Chitturi HT Telugu

25 September 2022, 17:39 IST

    • Bangladesh boat accident : 50కిపైగా మంది హిందువులు ప్రయాణిస్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తా కొట్టిన ఘటన బంగ్లాదేశ్​లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23మంది మరణించారు. అనేకమంది గల్లంతయ్యారు.
బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం.. 23మంది మృతి
బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం.. 23మంది మృతి (ANI/file)

బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం.. 23మంది మృతి

Bangladesh boat accident today: బంగ్లాదేశ్​లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 50మంది హిందూ భక్తులతో వెళుతున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఆదివారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. 50మందికిపైగా హిందువులు.. శతాబ్దాల కాలం నాటి ఓ ఆలయాన్ని దర్శించేందుకు బోడా ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. కరోటోవా నదిపై పడవ బోల్తా కొట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. 23 మృతదేహాలను వెలికితీశారు. 10మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇంకో 25మంది గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 70మంది కన్నా ఎక్కువ ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్​లోని బోడేశ్వరి ఆలయాన్ని ప్రతియేటా వేలాది మంది హిందువులు సందర్శించుకుంటారు. దేవీ నవరాత్రులు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

బంగ్లాదేశ్​లో ఆందోళనకర పరిస్థితులు..

Bangladesh boat sink news : పడవలు బోల్తా కొడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్​లో ఆందోళనకరంగా మారాయి. నిర్వహణ లోపాలు, సామర్థ్యానికి మంచి మనుషులను ఎక్కించుకోవడం ఇందుకు ప్రధాన కారణాలు.

పద్మా నదిలో మేలో జరిగిన పడవ ప్రమాదంలో 26మంది మరణించారు.

2021లో ఓ బోటును ఢీకొట్టి.. ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 32మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఏకంగా 78మంది మృతిచెందారు.

టాపిక్

తదుపరి వ్యాసం