తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women Needs More Sleep : పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ నిద్రపోవాలి?

Women Needs More Sleep : పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ నిద్రపోవాలి?

HT Telugu Desk HT Telugu

28 March 2023, 20:00 IST

  • Sleeping Tips : స్త్రీ పురుషుల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం.

మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం
మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం (Unsplash)

మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం

నిద్ర అనేది అందరికీ ముఖ్యం. అయితే పురుషులకంటే.. స్త్రీలకు మరింత ముఖ్యం. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరం? అధ్యయనాలు ఏమి రుజువు చేస్తున్నాయి? మహిళలకు ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం..

ట్రెండింగ్ వార్తలు

Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

Peanuts for Diabetic: మధుమేహం ఉన్నవారు వేరుశెనగ పలుకులను తినడం ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

స్త్రీల మెదళ్ళు వారి దినచర్య నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిద్రలేమి ఉన్న స్త్రీలు డిప్రెషన్(Depression), కోపానికి గురవుతారు. ఇది మాత్రమే కాదు విశ్రాంతి విషయంలో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ విశ్రాంతి అవసరం. దీని వెనుక బలమైన కారణం ఉంది.

స్త్రీల హార్మోన్లలో మార్పులు

యుక్తవయస్సు సమయంలో హార్మోన్లు, పీరియడ్స్(Periods) మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యం, నొప్పి కారణంగా మహిళల మెదడుకు ఎక్కువ నిద్ర అవసరం. ఇది కాకుండా, మహిళలు ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. కాబట్టి వారికి నిద్ర ఎక్కువగాఉండాలి.

రోజంతా పనిలో ఉంటారు

పెళ్లయి, పిల్లలు ఉన్న ఆడవాళ్లకు ఖాళీ సమయం ఉండదు. చాలా మంది మహిళలు పనికి వెళ్లి ఆ తర్వాత ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటారు. కొంత మంది మహిళలు కూలి పనులకు వెళ్లకపోయినా పిల్లలకు ఇంటిపనులే సరిపోతాయి. పిల్లలు రాత్రంతా మేల్కొన్నా తల్లికి సరిగా నిద్ర(Sleep) పట్టదు. ఆమె రోజంతా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోలేరు. ఇది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే సరైన నిద్రపోవాలి.

నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు

మహిళలు ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. పురుషులు బరువు పెరిగినా సులభంగా తగ్గించుకోవచ్చు. కానీ స్త్రీలకు బరువు తగ్గడం(Weight Loss) కొంచెం కష్టం. ఊబకాయం ఉన్న స్త్రీలు నిద్రలేమికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి నిద్రలేమి, అధిక బరువు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. అధిక కార్టిసాల్ విడుదలతో ఆకలి, ఊబకాయం సమస్యలు వస్తాయి. తగినంత నిద్రపోతే వీటి నుంచి బయటపడొచ్చు.

వారి కోసమే కష్టపడుతుంది

స్త్రీలు తమ భర్తలు, పిల్లల గురించి ఆందోళన చెందుతారు. తినడం(Eating), పడుకోవడం వదిలేసి తమ భర్తలకు, పిల్లలకు సేవ చేస్తుంటారు. అందువల్ల, మహిళలకు విశ్రాంతి అవకాశాలు చాలా తక్కువ. ఈ రొటీన్ కి అలవాటు పడిన ఆడవాళ్ళకి అవకాశం దొరికితే నిద్ర పట్టదు. ఈ కారణాల వల్ల స్త్రీలకు నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర పొందడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

మరోవైపు పురుషులు, స్త్రీల నిద్ర విధానాల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. నిద్ర మొదటి మూడు దశలు నాన్-రాపిడ్ ఐ మూమెంట్ (NREM) నిద్రగా పరిగణిస్తారు. వీటిలో మొదటి రెండు దశలు తేలికపాటి నిద్ర, మూడవ దశ గాఢ నిద్ర. ఈ దశలు పురుషులు మరియు స్త్రీలలో భిన్నంగా ఉంటాయి. పురుషుల కంటే మహిళలు మూడో దశ గాఢ నిద్రలో ఎక్కువ సమయం గడుపుతారు. మొదటి దశలో తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అయితే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువసేపు నిద్రపోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ అరగంటపైనే స్త్రీలకు నిద్ర ఎక్కువగా ఉంటే మంచిదట.