Men modelling lingerie : మహిళల లోదుస్తులు ధరించిన పురుషులు.. ప్రమోషన్​ కోసం తిప్పలు!-china bans women from modelling lingerie so men are doing it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  China Bans Women From Modelling Lingerie, So Men Are Doing It

Men modelling lingerie : మహిళల లోదుస్తులు ధరించిన పురుషులు.. ప్రమోషన్​ కోసం తిప్పలు!

Sharath Chitturi HT Telugu
Mar 05, 2023 07:39 PM IST

Men modelling lingerie in China : మహిళల లోదుస్తులు పురుషులు ధరిస్తే? వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ..! కానీ చైనాలో ఇదే జరుగుతోంది. మహిళలు ఆన్​లైన్​లో లోదుస్తులను ప్రమోట్​ చేయడంపై చైనాలో నిషేధం ఉంది. అందుకే.. కొంత మంది వ్యాపారులు.. పురుషులతో ఈ పని చేయిస్తున్నారు.

మహిళల లోదుస్తులు ధరించిన పురుషులు
మహిళల లోదుస్తులు ధరించిన పురుషులు (HT)

Men modelling lingerie in China : మహిళల లోదుస్తులకు సంబంధించి ఎన్నో యాడ్స్​ మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కొత్తకొత్త విధాలుగా వ్యాపార సంస్థలు ప్రమోషన్​లు చేస్తూ ఉంటాయి. కానీ ఆయా యాడ్స్​లో మహిళలు స్థానంలో.. పురుషులే వారి లోదుస్తుల్లో దర్శనమిస్తే? 'ఇదేం దారుణం' అనుకుంటున్నారా? చైనాలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. మహిళల అండర్​గార్మెట్స్​ విక్రయించే ఓ సంస్థ.. వారి లోదుస్తులను పురుషులకు వేసి, ప్రమోషన్స్​ చేసింది. చైనాలో ఉన్న కఠిన నిబంధనలు ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తెగ వైరల్​ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగిందంటే..

ఉమెన్​​ అండర్​గార్మెట్స్​ను ప్రదర్శించేందుకు సాధారణంగా మహిళలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కాగా.. ఆన్​లైన్​లో మహిళలు లోదుస్తులను ప్రదర్శించడంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెల్చిచేప్పింది. ఫలితంగా.. ఓ వ్యాపారి ఆ బాధ్యతలను పురుషులకు అప్పగించాడు.

Men modelling lingerie for ads in China : ఈ నేపథ్యంలో పురుషులు బ్రాలు, కార్సెట్స్​, నైట్​గౌన్స్​ వంటి మహిళల దుస్తులను ధరించి ప్రమోట్​ చేస్తున్న వీడియోలు.. చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. షూ అనే వ్యాపారి.. ఈ పని చేశాడు. అతనే కాదు.. నిషేధం నుంచి తప్పించుకుని, తమ బ్రాండ్​లను ప్రమోట్​ చేసుకునేందుకు చాలా మంది వ్యాపారులు సైతం.. ఇలా పురుషుల చేత మహిళల దుస్తులు వేయిస్తున్నారు. ప్రమోట్​ చేసుకుంటున్నారు.

"నాకు వేరే ఆప్షన్​ లేదు. డిజైన్​ పరంగా మార్పులు చేయలేము. అందుకే మా వద్ద ఉన్న పురుషులను ఉపయోగించుకుంటున్నాము," అని షూ పేర్కొన్నాడు.

'అబ్బయిలే బెటర్​గా వేసుకున్నారు..'

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోపై అక్కడి నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. "మహిళల లోదుస్తులకు సంబంధించిన లైవ్​స్ట్రీమ్​పై బ్యాన్​ విధించడం ఇది కొత్తేమీ కాదు. చాలా సార్లు ఇలా జరిగింది," అని ఓ వ్యక్తి కామెంట్​ చేయగా.. "మహిళల కన్నా ఆ అబ్బాయే వాటిని బాగా వేసుకున్నాడు," అని మరో నెటిజన్​ రాసుకొచ్చాడు. "గతంలో మహిళలకు నటించే అవకాశం ఉండేది కాదు. అందుకే చాలా వరకు మహిళల పాత్రలను కూడా పురుషులే ధరించే వారు. ఇప్పుడు కూడా ఇలాగే ఉందనిపిస్తోంది," అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.

China latest news : మహిళల లోదుస్తుల ప్రదర్శనపై నిషేధం ఉండటంతో పురుషులను ఉపయోగించుకోవడం తాత్కాలిక చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంత కాలం వ్యాపారులు ఇలా చేస్తూ ఉండగలరని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం