Sleep Effect On Brain : ఒక్క రాత్రి నిద్రలేకుంటే.. మెదడుకు రెండేళ్ల వయసు పెరుగుతుంది
Sleep Effect On Brain : ఒక్క రాత్రి నిద్రపోకుంటే ఏం కాదులే అనుకుంటున్నారా? కానీ చాలా ప్రమాదం.. మీ మెదడుకు రెండేళ్ల వయసు పెరుగుతుంది. పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఒక్క రాత్రి మేల్కొని ఉంటే.. ఏం కాదు.. మళ్లీ రోజంతా పడుకోవచ్చులే అనుకునేవారికి ఓ షాకింగ్ న్యూస్. మీరు ఒక్క రాత్రి(One Night) మెళకువతో ఉంటే.. మీ మెదడుకు రెండు సంవత్సరాల వయసు పెరిగిపోతుంది. తాజాగా ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్‌లో వివరాలు ప్రచురితం చేశారు. ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా నిద్రలేమితో బాధపడే వ్యక్తుల మెదళ్లను పరిశోధకులు పరిశీలించారు.
అయితే అదే వ్యక్తులు ఒక రాత్రి నిద్రపోయినప్పుడు వారి మెదళ్లను పరిశీలించారు. నిద్రలేమితో ఉన్నవారి మెదడు(Mind)లో కలిగిన మార్పులు కూడా పరిశోధన చేశారు. నిద్రలేమితో ఉన్నవారి మెదడు రెండు సంవత్సరాలు పెద్దయ్యాక ఉన్న మెదడులాగా ఉండటం గమనించారు. జర్మనీలోని RWTH ఆచెన్ విశ్వవిద్యాలయంతో సహా అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని తెలిపింది.
కేవలం ఒక్క రాత్రి నిద్రలేకుండా ఉండడం వల్ల మీ మెదడుకు ఏళ్లు పెరుగుతాయని అధ్యయనం కనుగొంది. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో కనిపించిన అధ్యయనంలో ఒక రాత్రి నిద్ర లేమి మెదడు వయస్సు రెండు సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా మంచి రాత్రి నిద్ర తర్వాత మార్పులు తిరిగి పొందగలవని అధ్యయనం చూపించింది. పాక్షిక నిద్ర లేమి తర్వాత మెదడు వయస్సులో మార్పును కనుగొనలేదు.
నిద్ర(Sleeping) కోల్పోవడం అనేది మానవ మెదడును అనేక స్థాయిలలో విస్తృతంగా ప్రభావితం చేస్తుంది. అనేక నిద్ర లక్షణాలలో వయసు సంబంధిత మార్పులు, తగ్గిన నిద్ర నాణ్యత వృద్ధాప్యం లక్షణం సూచిస్తున్నాయి. నిద్ర భంగం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అధ్యయనంలో పరిశోధకులు మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించి మెదడు వయస్సు అంచనాలను నిద్రలేమి వ్యక్తుల మెదడు MRI స్కాన్‌ల నుండి రూపొందించారు. ఒక రాత్రి పూర్తి నిద్ర లేమి మెదడులో ఒకటి లేదా రెండు సంవత్సరాల వృద్ధాప్యం తర్వాత కనిపించే మార్పులను చూపిస్తుంది.
మెదడుపై నిద్ర లేమి ప్రభావంపై మునుపటి పరిశోధనలతో ఈ ఫలితాలు పోల్చిచూశారు. నిద్ర లేమి ఉన్నవారి మెదడుల్లో ద్రవం పంపిణీ, గ్రే మ్యాటర్ పరిమాణంలో మార్పులతో సహా అనేక రకాల మార్పులు జరుగుతాయని ఆధారాలు ఉన్నాయి.
టాపిక్