చాలా మంది మహిళలు పీరియడ్స్(Periods) సమయంలో వెన్నునొప్పి(Back Pain), కడుపు నొప్పి, కాళ్ల తిమ్మిరితో బాధపడుతారు. రుతుక్రమం వల్ల కనీసం ఐదు రోజులపాటు బలహీనంగా తయారవుతుంది. కాబట్టి మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో ఏం తాగాలి అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు 5 పానీయాల గురించి తెలుసుకోండి.
చమోమిలే టీ.. బ్రూ హిప్యూరేట్, గ్లైసెమిక్ వంటి సమ్మేళనాలతో నిండి ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నీటిని మరిగించి, దానికి ఒక టీస్పూన్ చమోమిలే జోడించండి. వేడి వేడిగా తాగడం ద్వారా మీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు.
ఒక కప్పు అల్లం టీ(Ginger Tea)తో రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందండి. అల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నొప్పి నివారిణి కూడా. పీరియడ్స్ సమయం(Periods Time)లో తాగడానికి అనువైన పానీయం. మరిగే నీటిలో కొన్ని సన్నని అల్లం ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత వేడివేడిగా తీసుకోవాలి.
గ్రీన్ స్మూతీస్.. కొన్ని కివీ పండు, కొత్తిమీర, తాజా పుదీనా ఆకులు, కొన్ని అల్లం ముక్కలను కలపండి. ఈ స్మూతీ ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
పిప్పరమింట్ టీ(peppermint tea)తో ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. పుదీనా టీ తయారు చేయడానికి తాజా పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించండి. పీరియడ్స్ సమయంలో వేడి వేడిగా తాగడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
దాల్చిన చెక్క అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే మసాలా. ఇది ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీటిలో ఒక దాల్చిన చెక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కాస్త మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో తేనె కలిపి తాగాలి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. సగానికి పైగా మహిళవు నెలసరి సమయంలో ఎక్కువ నొప్పిని పొందుతారు. కచ్చితంగా చెప్పాలంటే 84 శాతం మంది దీనితో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.ఈ నొప్పి వారిని చాలా బలహీనంగా చేసేస్తుంది. అందుకే వారు తమ ఋతుక్రమంలో ఉన్నప్పుడు వారి రోజువారీ పనులను పూర్తి చేయడానికి కూడా కష్టపడతారు. పైగా ఆ సమయంలో సరిగా తినరు. కాబట్టి ఇంకా బలహీనపడే అవకాశముంది. సరైన ఆహారం తీసుకోవాలి.