తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Growth Oil : ఈ నూనె రాస్తే.. మీ జుట్టు సూపర్​గా పెరుగుతుంది

Hair Growth Oil : ఈ నూనె రాస్తే.. మీ జుట్టు సూపర్​గా పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu

31 March 2023, 8:41 IST

  • Oil For Hair Growth : జుట్టు ఒత్తుగా పెరగాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఎలా పెంచుకోవాలి? మార్కెట్లో దొరికే.. ఏదేదో ఆయిల్ తీసుకొచ్చి ఉపయోగిస్తారు. కానీ ఫలితం శూన్యం. అందుకే.. ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకోండి. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

హెయిర్ గ్రోత్
హెయిర్ గ్రోత్ (unsplash)

హెయిర్ గ్రోత్

Hair Growth Oil : జీవనశైలి(Lifestyle) మారింది. జుట్టు సమస్యలు అధికం అయ్యాయి. ఏం చేసినా.. జుట్టు పెరగకపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇక చిన్న వయసులోనే తెల్లజుట్టు(White Hair) రావడం అనేది చాలా పెద్ద సమస్య అయింది. అయితే ఇంట్లో ఉండే పదార్థాలతోనే మీ జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలడం(Hair Loss) కూడా తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్య నుంచి కూడా కాస్త బయటపడొచ్చు. ఇంట్లోనే తయారు చేసుకునే ఆ నూనె ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

మీ జుట్టు పెరిగేందుకు కలబంద(aloevera), మెంతులు, కొబ్బరి నూనె(Coconut Oil)ను వాడాలి. మెుదట ఒక గిన్నెలో ఓ 50 ఎమ్ఎల్ కొబ్బరి నూనెను తీసుకోండి. ఇప్పుడు ఇందులో.. ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి. తర్వాత కలబంద అంచులను కట్ చేసి.. ముక్కలుగా చేసి నూనెలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నూనెను మంటపై వేడి చేయాలి. కలబంద ఆకుల్లో ఉండే నీరంతా.. వెళ్లి.. ఆకులు నల్లగా మారే వరకూ.. మంటపై కలుపుతూ.. వేడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి.

ఇక మీకు నూనె తయారు అవుతుంది. ఇప్పుడు ఈ నూనెను చల్లారే వరకూ ఉంచాలి. ఆ తర్వాత వడకట్టుకుని.. గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత నూనె సరిపోతుందో.. అది ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల ఉల్లిపాయ రసం వేసుకోండి. బాగా కలపాలి. తయారైన నూనెను ఇప్పుడు మీ జుట్టు(Hair) కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి. అలా పెట్టుకున్న నూనెను రోజంతా.. అలాగే ఉంచి.. మరుసటి రోజు.. తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు చేయండి.

ఇలా చేస్తే.. జుట్టు రాలడం(Hiar Loss) తగ్గుతుంది. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది(Hair Growth). కలబంద, ఉల్లిపాయ, మెంతులు, కొబ్బరి నూనెలో జుట్టుకు అవసరమయ్యే పోషకాలు దొరుకుతాయి. ఈ నూనె పెట్టుకుంటే.. చుండ్రు సమస్య(Dandruff Problem) నుంచి కూడా బయటపడొచ్చు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెను ఉపయోగిస్తే.. జుట్టు సమస్యలు పోతాయి. జుట్టు ఒత్తుగా, అందంగా తయారు అవుతుంది.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

టాపిక్