Tea Decoction For Hair : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా ఇది
White Hair To Black Hair : తెల్ల జుట్టుతో చాలా మంది సమస్యల ఎదుర్కొంటున్నారు. తెల్లజుట్టు కారణంగా ఒత్తిడికి గురయ్యేవారూ ఉన్నారు. ఎన్ని ట్రై చేసినా.. తెల్లజుట్టు అలానే ఉంటుందని బాధపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
కొన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఇంట్లోనే తయారుచేసుకునే చిట్కాలతో తెల్ల జుట్టు నల్లగా(White To Black Hair) మార్చుకోవచ్చు. చుండ్రు సమస్య(Dandruff) కూడా తగ్గుతుంది. కేవలం రెండు పదర్థాలతో ఓ చిట్కా ఉంది. అది ఉపయోగిస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు.. అనేక రకాలైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మంచి ఫలితం ఉంటుంది. ఆ చిట్కా ఏంటి.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
తెల్లజుట్టు నల్లగా మారేందుకు మీరు రెండు టీ స్పూన్ల టీ పౌడర్(Tea Powder), అరచెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో టీ పౌడర్ వేసి 10 నిమిషాల వరకూ వేడి చేయాలి. డికాక్షన్(Decoction) తయారు అవుతుంది. దానిని వడకట్టి గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు అందులోకి నిమ్మరసాన్ని(Lemon) తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలోకి దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దూది వాడితే.. కష్టంగా ఉన్నవారు స్ర్పే బాటిల్ కూడా వాడుకోవచ్చు. దీనిని జుట్టు కుదుళ్లకు పట్టించిన తర్వాత.. ఐదు నిమిషాలపాటు సున్నితంగా మర్దనా చేయాలి. అలా గంటపాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం(Headbath) చేయాలి. షాంపూను మాత్రం ఉపయోగించకూడదు.
ఈ మిశ్రమాన్ని తలకు రాసుకున్న తర్వాతి రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయండి. జుట్టు సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడేవారు.. ఈ చిట్కాను పాటిస్తే.. ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాతో జుట్టు రాలడం(Hair Loss) తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు(White Hair)తో బాధపడేవారికి ఇది మంచి చిట్కా. జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసేందుకు పెద్ద కష్టమేమీ కాదు. తేలికగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం(White Hair) ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.