Black Hair Tips : స్నానానికి ముందు ఇలా చేయండి.. జుట్టు నల్లగా మారుతుంది-white hair to black hair use fenugreek and kalonji seeds for hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  White Hair To Black Hair Use Fenugreek And Kalonji Seeds For Hair Growth

Black Hair Tips : స్నానానికి ముందు ఇలా చేయండి.. జుట్టు నల్లగా మారుతుంది

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 05:20 PM IST

Black Hair Tips Telugu : జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా.. జుట్టు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది.

సహజమైన పద్ధతులతో జుట్టును ఇలా కాపాడుకోండి..
సహజమైన పద్ధతులతో జుట్టును ఇలా కాపాడుకోండి..

చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి.. మీ జుట్టును నల్లగా(Black Hair) మార్చుకోవచ్చు. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు(Hair Problems) వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం కారణంగా.. మీ జుట్టు సరిగా ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి ఇంట్లోని చిట్కాలను పాటించి.. బయటపడొచ్చు.

ఈ చిట్కాలను తయారు చేసుకునేందుకు మెంతులు, కాళోంజి విత్తనాలను(Kalonji Seeds) వాడాలి. మెంతులు, కాలోంజి విత్తనాల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటితో మీ జుట్టు బలంగా(Strong Hair) తయారు అవుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మెుదట ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల మెంతులు, రెండు టీ స్పూన్ల కాళోంజి విత్తనాలను వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఇందులో నిమ్మరసం(Lemon) వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేశాక నీళ్లు చల్లగా అయిన తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్లలోకి స్ప్రే చేయాలి. ఆ నీటిలో దూదిని ముంచి మీ జుట్టు కుదుళ్లకు పట్టించుకోవచ్చు. తర్వాత సున్నితంగా మర్దనా చేయాలి. అలా ఓ అరగంట నుంచి గంటవరకూ ఉంచుకోవాలి. తర్వాత రసాయనాలు తక్కువగా ఉంటే షాంపూతో తలస్నానం చేయాలి.

అలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు ఒత్తుగా పెంచుకోవచ్చు. ఈ చిట్కాను తయారుచేసుకునేందుకు.. ముందుగానే.. మీరు మెంతులు, కాళోంజి విత్తనాలను పౌడర్ చేసుకుని.. హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగించుకోవచ్చు. జుట్టు సమస్యలతో బాధపడేవారు.. ఈ చిట్కాను పాటిస్తే.. నల్లజుట్టు(Black Hair) మీ సొంతం అవుతుంది. జుట్టు బలంగా ఉంటుంది. ఒత్తైన, పొడవైన, కాంతివంతంగా మీ జుట్టు తయారు అవుతుంది.

అంతేకాదు.. ఉల్లిపాయ రసం(onion juice for hair) అనేది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరినూనె(Coconut Oil), మందార, కరివేపాకు వంటి ఇతర ఆయుర్వేద మూలికలతో కలిపి అప్లై చేయడం వల్ల కుదుళ్లకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మీ జుట్టుకు పెట్టుకుని కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచండి.

ఉసిరి(Indian gooseberry).. కూడా మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని(Hair Loss) నిరోధించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో, ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి, కొద్దిగా ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. మీరు కొబ్బరి నూనె(Coconut Oil)తో ఉసిరి పొడిని మిక్స్ చేసి జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్