Potato For Hair : బంగాళాదుంపతో ఇలా చేస్తే.. మీ జుట్టు పెరుగుతుంది!
Potato For Hair Growth : జుట్టు సమస్యలతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లో ఉన్నవాటితోనే కొన్ని చిట్కాలు పాటించి.. సమస్యలను దూరం చేసుకోవచ్చు.
జుట్టు రాలడం(Hair Loss) సమస్య ఈ కాలంలో ఎక్కువైపోయింది. చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక కారణాలతో జుట్టు రాలుతుంది. వాతావరణ కాలుష్యం(Pollution), ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం వంటి వివిధ రకాల కారణాలతో జుట్టు రాలిపోతుంది. ఇంట్లో ఉండే వాటితో చిట్కాలు పాటించి.. జుట్టును పెంచుకోవచ్చు. ఉల్లిపాయ రసం, బంగాళాదుంప రసం, నిమ్మరసాన్ని ఉపయోగించాలి.
మెుదట ఉల్లిపాయను తీసుకోవాలి. దానిని ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత బంగాళాదుంప(Potato)ను తీసుకుని దానిపై ఉండే పొట్టును తీసేసి.. ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం(Lemon) కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన మిశ్రమాన్ని.. జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి. ఆరిన తర్వాత.. షాంపూ వాడకుండా తలస్నానం చేయాలి. ఆ తర్వాతి రోజు షాంపూ వాడొచ్చు.
ఇలా బంగాళాదుంపతో చేసిన మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు చేయండి. పలుచగా మారిన జుట్టు(Hair) ఒత్తుగా మారుతుంది. బంగాళాదుంప, ఉల్లిపాయతో మన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే.. ఎన్నో పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలలో ఎంతో సాయపడతాయి. ఈ చిట్కాతో చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి. వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే.. మంచి ఫలితం పొందవచ్చు.
ఈ కాలంలో రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం(White Hair) ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.
సంబంధిత కథనం
టాపిక్