Aloe Vera For Hair Growth : ఇది వాడితే.. నెలలోనే జుట్టు పెరుగుతుంది-aloe vera for hair growth check more details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Aloe Vera For Hair Growth Check More Details Inside

Aloe Vera For Hair Growth : ఇది వాడితే.. నెలలోనే జుట్టు పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 06:45 PM IST

Aloe Vera For Hair : జుట్టు పెరగట్లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. లాభం లేదని ఒత్తిడికి లోనవుతారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో మీ జుట్టును పెంచుకోవచ్చు.

హెయిర్ టిప్స్
హెయిర్ టిప్స్

జుట్టును అందంగా ఉంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ జుట్టు రాలడం(Hair Loss), తెల్ల జుట్టు, జుట్టు పొడిబారడం, జుట్టు తెగిపోవడం, కొంతమంది జుట్టు పెరుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించి.. మీ జుట్టు సమస్యల(Hair Problems) నుంచి బయటపడొచ్చు. చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రకాల చిట్కాలను పాటించి మీ జుట్టును అందంగా చేసుకోవచ్చు. అందుకోసం కలబంద(Aloe Vera) చక్కగా ఉపయోగపడుతుంది.

మూడు టీ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోండి. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె(Coconut Oil), ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. మెుదట ఒక జార్ లో కలబంద గుజ్జు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ గుజ్జును ఓ గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సుల్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి.

రెండు మూడు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం(Head Bath) చేయాల్సి ఉంటుుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించే సమయంలో జుట్టుకు నూనె లేకుండా చూసుకోండి. నూనె(Oil) ఉండటం వల్ల జుట్టు కుదుళ్లకు మిశ్రమం సరిగా అప్లై అవ్వదు. వారానికి రెండు సార్లు నెల రోజులపాటు ఇలా చేయండి. ఇలా చేస్తే.. జుట్టు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయన్నమాట. జుత్తు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చాలా వరకు జుట్టు సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు.

తెల్లజుట్టు నల్లగా మారేందుకు ఓ చిట్కా ఉంది. రెండు టీ స్పూన్ల టీ పౌడర్(Tea Powder), అరచెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో టీ పౌడర్ వేసి 10 నిమిషాల వరకూ వేడి చేయాలి. డికాక్షన్(Decoction) తయారు అవుతుంది. దానిని వడకట్టి గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు అందులోకి నిమ్మరసాన్ని(Lemon) తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలోకి దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. దూది వాడితే.. కష్టంగా ఉన్నవారు స్ర్పే బాటిల్ కూడా వాడుకోవచ్చు. దీనిని జుట్టు కుదుళ్లకు పట్టించిన తర్వాత.. ఐదు నిమిషాలపాటు సున్నితంగా మర్దనా చేయాలి. అలా గంటపాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం(Headbath) చేయాలి. షాంపూను మాత్రం ఉపయోగించకూడదు.

ఈ మిశ్రమాన్ని తలకు రాసుకున్న తర్వాతి రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయండి. జుట్టు సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడేవారు.. ఈ చిట్కాను పాటిస్తే.. ఫలితం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్