Summer Skin Care : వేసవిలో మీ చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు
Summer Skin Care : వేసవిలో చర్మం సంరక్షణ చాలా ముఖ్యం. ముఖ్యమైన నూనెలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేమగా, ప్రకాశవంతం చేస్తాయి. ఎండాకాలంలో పొడి చర్మం నుంచి కాపాడుకునేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఎండాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సూర్యుడు వేడితో చర్మ సమస్యలు(Skin Problems) వస్తాయి. కాబట్టి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. మీరు ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ సన్‌స్క్రీన్(Sun Screen) అప్లై చేయడం గుర్తుంచుకోండి. అయినప్పటికీ, మీ చర్మాన్ని హైడ్రేట్ గా, మెరుస్తూ ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. కొన్ని రకాల నూనెలు(Oils) మీ చర్మాన్ని మృదువుగా, తేమగా, మెరుస్తూ ఉంచుతాయి. పొడి చర్మాన్ని(Dry Skin) నయం చేసే నూనెలు ఇక్కడ ఉన్నాయి.
కొబ్బరి నూనె(Coconut Oil)ను ప్రాచీన కాలం నుండి చర్మ ఆరోగ్యానికి ఉపయోగిస్తున్నారు. విటమిన్ ఇ, కె కంటెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల కారణంగా, కొబ్బరి నూనె మీ చర్మ ప్రకాశాన్ని పెంచుతుంది.
బాదం నూనె చర్మానికి పోషణనిచ్చి పునరుజ్జీవింపజేస్తుంది. ఎండ వేడిమి వల్ల దెబ్బతిన్న చర్మానికి చికిత్స చేస్తుంది, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ముఖం మెరుపును పెంచుతుంది.
చర్మం ఎరుపు, చికాకును తగ్గించడంలో జోజోబా ఆయిల్ కూడా చాలా సహాయపడుతుంది. తామర, సోరియాసిస్, మొటిమల వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో జోజోబా ఆయిల్ వివిధ ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది. దాని నుండి ప్రయోజనం పొందడానికి, దానిని క్లెన్సర్, మాయిశ్చరైజర్ లేదా స్పాట్ ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించండి. ఇది మీ ముఖంతో సహా మీ శరీరంలోని వివిధ భాగాలకు అప్లై చేసుకోవచ్చు.
గ్రేప్ సీడ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని లినోలిక్ యాసిడ్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి అప్లై చేసినప్పుడు, ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఈ వేసవిలో మీ చర్మం మెరుస్తూ ఉండాలంటే వారానికోసారి సన్‌ఫ్లవర్ ఆయిల్(Sun Flower Oil)తో మసాజ్ చేయండి.
టాపిక్