తెలుగు న్యూస్  /  Lifestyle  /  Warning Signs And Symptoms Of Liver Dieses In Telugu

Liver Damage Signs : ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీ లివర్ డ్యామేజ్ అయినట్లే..

24 September 2022, 14:00 IST

    • Liver Damage Signs : అసలే పండుగ కాలం ఇది. ఈ సమయంలో చాలామంది డ్రింక్ చేస్తూ ఉంటారు. అయితే మీరు బాగా తాగితే మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కాలేయ సమస్యలు అంత త్వరగా బయటపడవు. కానీ కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం.. మీ లివర్​ని కాపాడుకోవాల్సిన టైమ్ ఆసన్నమైనట్లే. ఆ సమయంలో డ్రింక్​కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Liver Damage Signs
Liver Damage Signs

Liver Damage Signs

Liver Damage Signs : కాలేయం మానవ శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం. ఇది అత్యంత సంక్లిష్టమైన అవయవాలలో ఒకటి. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి గణనీయంగా దోహదపడుతుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేయడం, మీ ఆహారం నుంచి పోషకాలను అందించడం. మీ రక్తం నుంచి విష పదార్థాలను తొలగించడం, కొవ్వులు, ఆల్కహాల్, మందులను విచ్ఛిన్నం చేయడం, రక్తంలో చక్కెర, హార్మోన్ స్థాయిలను నియంత్రించడం, ఇనుమును నిల్వ చేయడం వంటి అనేక విధులను నిర్వహిస్తుంది. అయితే దీని సమస్యలు అంత త్వరగా బయటపడవు కాబట్టి.. కొన్ని లక్షణాలు మీరు గుర్తిస్తే.. మీ కాలేయం ప్రమాదంలో పడినట్లు గుర్తించాలి. వెంటనే వైద్యుని సలహాలతో చికిత్స్ తీసుకోవాలి. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Oatmeal omelette: బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ అల్పాహారం

వికారం లేదా వాంతులు

మానవ కాలేయం విష పదార్థాలను తొలగించగలదు. కానీ తరచుగా వికారం, వాంతులు అవుతుంటే.. అవి కాలేయ వ్యాధి హెచ్చరిక సంకేతాలుగా గుర్తించాలి.

ముదురు రంగు మూత్రం

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తుంది. ముదురు రంగు మూత్రం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. శరీరంలో హానికరమైన పదార్థాల ఉనికిని కూడా సూచిస్తుంది.

కామెర్లు

కాలేయ వ్యాధికి ప్రాథమిక సంకేతాలలో ఒకటి కామెర్లు. కామెర్లు అంటే కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారడం. కాలేయ కణాల నాశనం ఫలితంగా ఇది సంభవిస్తుంది. ఇది రక్తంలోకి విడుదలయ్యే బిలిరుబిన్ మొత్తాన్ని పెంచుతుంది.

చర్మం దురద

అధిక స్థాయిలో చర్మంపై దురద వస్తుంది అంటే కనుక.. అది కాలేయ వ్యాధికి ప్రారంభ సంకేతం.

అలసట

ఏ పనిచేయకుండానే అలసటగా అనిపిస్తుందా? అయితే ఇది కూడా కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ, ప్రారంభ సంకేతాలలో ఒకటి. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అలసటగా ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

వాంతిలో రక్తం

దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లక్షణాలు ఎదుర్కొంటున్నప్పుడు వాంతుల్లో రక్తం కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని మీరు గుర్తిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

కొన్నిసార్లు కాలేయ సమస్యలు.. ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తాయి. కాబట్టి సాధారణ శారీరక రక్త పరీక్షతో పాటు వార్షిక భౌతిక పరీక్షలు చేయించడం మంచిది. ఇది మీ కాలేయ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయం చేస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించడం వంటి ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు కూడా మెరుగైన కాలేయ ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.

టాపిక్