Motion Sickness | ప్రయాణ సమ‌యాల్లో వాంతులు అవ‌కుండా ఈ చిట్కాల‌ను పాటించండి-how to prevent motion sickness on a car bus or train ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Prevent Motion Sickness On A Car, Bus Or Train

Motion Sickness | ప్రయాణ సమ‌యాల్లో వాంతులు అవ‌కుండా ఈ చిట్కాల‌ను పాటించండి

Rekulapally Saichand HT Telugu
Dec 30, 2021 05:02 PM IST

కొందరు ప్రయాణాల్లో అస్వస్థతకు గురవుతారు. వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీన్ని మోషన్ సిక్‌నెస్ అంటారు. ప్రయాణ సమయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది? కొంత మందికి మాత్రమే ఇలా జరగడానికి కారణమేమిటి?

vomiting-
vomiting-

కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు.  కారులో లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు, కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికిి గల కారణాలు, నివారణలు రెండింటినీ ఇప్పుడు తెలుసుకోండి.

వాంతులు ఎందుకు అవుతాయి?

ప్రయాణంలో వాంతులు కావడాన్ని మోషన్ సిక్‌నెస్ లక్షణాలు అంటారు. ఇది వ్యాధి కాదు. చెవులు, కళ్లు, చర్మం నుంచి మెదడు వేర్వేరు సంకేతాలను స్వీకరించినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదరవుతుంది. దీని వల్ల కేంద్ర నాడీ వ్యవస్థలో స్వల్ప అంతరాయం కలుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోషన్ సిక్‌నెస్ నుంచి బయటపడటం చాలా సులభం.

కారు ముందు సీట్లు కూర్చోండి

ప్రయాణంలో మీకు వాంతులు అయే పరిస్థితి ఉంటే వెనుక సీట్లో కూర్చోకుండా ముందు సీట్లో కూర్చోండి . వెనుక సీటులో కూర్చోవడం వల్ల వాహన వేగం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది మీకు మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. బస్సు లాంటి పెద్ద వాహనాల్లో కూడా ముందు కూర్చోవాలి. అంటే.. మరీ డ్రైవర్ వెనుక సీటులో కూడా కూర్చోవద్దు.

పుస్తకాలు,ఫోన్ చూడొద్దు..

ప్రయాణంలో వామిటింగ్ సెన్షేషన్ ఉంటే పుస్తకాన్ని అస్సలు చదవకండి. ఫోన్ చూడడం, పుస్తక పఠనం చేయడం వల్ల మీ మెదడుకు సందేశాలు కాస్త తికమకగా మారుతాయి.

తాజా గాలి

ప్రయాణంలో కాస్త ఇబ్బందిగా ఉంటే, కారు కిటికీ తెరిచి, బయట కాస్త స్వచ్ఛమైన గాలికి  సేద తీరండి.  అప్పడప్పుడు కారులో స్వచ్ఛమైన గాలి లేని కారణంగా కూడా వాంతుల వంటి సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో ప్రయాణాలు వద్దు

ఖాళీ కడుపుతో ప్రయాణించడం వల్ల వాంతులు రావు అనేది అపోహ మాత్రమే. ఆహారం తీసుకోకుండా ప్రయాణించే వ్యక్తులలో మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కావున ప్రయాణ సమయంలో తేలికపాటి పోషక ఆహారాన్ని తీసుకోండి.

ట్రిప్‌లో వాంతులయే సూచనలు ఉంటే, ఇంటి నుండి బయలుదేరే ముందు కొన్ని సాధారణ చిట్కాలు పాటించండి. ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం.

1. మీ ప్రయాణ సమయంలో నిమ్మకాయను తీసుకెళ్లండి. మీకు వికారం అనిపించినప్పుడు, వెంటనే ఈ నిమ్మకాయ వాసన చూడండి. ఇది మీకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. వాంతులు రాకుండా చేస్తుంది.

2. లవంగాలను వేయించి, సన్నగా తరిగి బాక్స్‌లో పెట్టి మీ ప్రయాణ సమయంలో మీతో తీసుకెళ్లండి. వాంతులు అవుతుంటే చిటికెడు పంచదార లేదా నల్ల ఉప్పు వేసి నములుతూ ఉండండి.

3. తులసి ఆకులను నమలడం వల్ల వాంతులు రావు. అలాగే నిమ్మ, పుదీనా రసాన్ని ఒక సీసాలో నింపి బ్లాక్ సాల్ట్ వేసుకుని ప్రయాణంలో అప్పుడప్పుడు తాగుతూ ఉండండి.

4. నిమ్మకాయను కోసి, దానిపై ఎండుమిర్చి, నల్ల ఉప్పును చల్లి దాన్ని కాస్త రుచి చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ప్రయాణ సమయంలో మీ మనస్సు ప్రశాంతంగా ఉండి వాంతులు అవవు.

5. గ్లాసు నీళ్ళలో కొద్దిగా జీలకర్ర పొడి మిక్స్ చేసి ప్రయాణానికి ముందు త్రాగాలి. దీంతో వాంతులు, వికారం నుండి ఉపశమనం కలుగుతుంది.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్