Telugu News  /  Lifestyle  /  You Should Know About These Fatty Liver Early Signs - Fatty Liver Disease Early Signs
Fatty Liver Disease Early Signs
Fatty Liver Disease Early Signs

చేతులు, అరికాళ్ళపై దురదగా ఉందా? అయితే ఈ తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు

28 July 2022, 22:24 ISTHT Telugu Desk
28 July 2022, 22:24 IST

Fatty Liver Disease Early Signs :ఈ మధ్య కాలంలో చాలా మందిని కాలేయ సంబంధిత వ్యాధులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు వేగంగా పెరుతున్నాయి. మొత్తం కాలేయ బరువులో 5-10% మించి కొవ్వు ఉంటే, అది సమస్యగా మారుతుంది. అయినప్పటికీ, ఈ పరిస్థితి ఉన్నవారిలో 7% నుండి 30% మంది వ్యక్తుల్లో కాలక్రమేణా ఈ లక్షణాలు తీవ్రమవుతున్నట్లు డేటా చూపిస్తుంది.

కొవ్వు కాలేయ వ్యాధి లేదా స్టీటోసిస్ అనేది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం కారణంగా ఏర్పడే అసాధారణ స్థితి. సాధరణంగా కాలేయంలో కొవ్వు నిర్దిష్ట స్థాయిలో ఉంటుంది. అయితే ఇది మొత్తం కాలేయం బరువులో 5-10% మించి ఉంటే, అది సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితి ఉన్నవారిలో 7% నుండి 30% మంది వ్యక్తులు కాలక్రమేణా లక్షణాలు తీవ్రమవుతున్నట్లు వివిధ అద్యయనాల తెలుస్తో్ంది. ఫ్యాటి లివర్ కారణంగా శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కొవ్వు కాలేయ వ్యాధులకు నిర్దిష్ట కారణమనేది లేదు.

ట్రెండింగ్ వార్తలు

కొవ్వు కాలేయ వ్యాధి రకాలు

ఆల్కహాల్-సంబంధిత కొవ్వు కాలేయ వ్యాధి (ARLD)

ఆల్కహాల్-ప్రేరిత కొవ్వు కాలేయ వ్యాధి అనేది అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏర్పడే పరిస్థితి. UK నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, కనీసం 2 వారాల పాటు మద్యపానానికి దూరంగా ఉంటే ARLDలో తగ్గింపు ఉంటుంది.

నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ (NAFLD):

ఈ స్థితిలో, అధిక కొవ్వు కాలేయంలో పేరుకుపోతుంది. దీని వల్ల స్థూలకాయం, మధుమేహం లేదా అధిక ట్రైగ్లిజరైడ్స్ వంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాకుండా, ఎక్కువ కేలరీలు వినియోగం వల్ల నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కారణమవుతుంది.

లక్షణాలు

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ప్యాటీ లివర్ సమస్య వస్తుంటుంది. చాలా సందర్భాలలో, పరిస్థితి తీవ్రమైన దశకు వెళ్లే వరకు ఈ లివర్ డిసీజ్ స్పష్టంగా కనిపించదు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లోని నిపుణులు ప్రకారంగా సాయంత్రం లేదా రాత్రిపూట చేతులు, అరికాళ్ళపై తీవ్రమయ్యే 'దురద' ఉంటే ఇది కొవ్వు కాలేయ వ్యాధిని సూచిస్తుందని అంటున్నారు. బాటన్ రూజ్ జనరల్ మాయో క్లినిక్ కేర్ నెట్‌వర్క్ ప్రకారం, ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు, నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధులలో దురద సమస్య ఉంటుంది. ఇది కాకుండా, విశ్రాంతి లేకపోవడం మరియు చర్మ అలెర్జీలు కూడా వస్తుంటాయి.

టాపిక్