Energy Foods: ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉందా.. అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోండి!
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుంది. మీకు కూడా ఇబ్బందే అనిపిస్తే, తక్షణ శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి ఆహారాలను తీసుకోండి.
రోజువారి దినచర్య సాఫీగా సాగాలంటే అరంభం చక్కగా ఉండాలి. ఉదయం నిద్రలేవగానే చేసే కొన్ని మంచి పనులు వల్ల ఆ రోజంతా చక్కగా సాగుతుంది. అయితే చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే అలసట మొదలవుతుంది. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం వల్ల కావచ్చు. తీసుకునే ఆహారం విషయంలో చేసే పొరపాట్ల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదరవుతుంది. అటువంటి పరిస్థితిలో, కొన్నిఆహార చిట్కాలు పాటించడం ద్వారా ఉదయం పూట అలసటను అనిపించదు. ఉదయాన్నే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది
1) గుమ్మడికాయ గింజలు
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, జింక్ ఉంటాయి. ఇది హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా వీటిలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఉదయం పూట ఈ విత్తనాలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
2) వాల్నట్
ఉదయం పూట వాల్‌నట్‌లను తినడం వల్ల తక్షణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3, జింక్, సెలీనియం, ప్రొటీన్, విటమిన్ బి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
3) డెట్స్
ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన చక్కెర లభిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సజువుగా సాగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రోజు ఉదయం ఖర్జూరం తినడం ద్వారా శక్తిని పెంచుకోవచ్చు.
4) బాదం
ఇది బరువు తగ్గడంతో పాటు, బాదం ఎముకలు, మానసిక స్థితికి కూడా మంచిది.అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు.ఇది రక్త ప్రవాహంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని గణనీయంగా పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినడం వల్ల చాలా అరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఉదయం నిద్ర లేవగానే, వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగాలి, ఇలా చేయడం ద్వారా పూర్తిగా హైడ్రేటెడ్‌గా ఉంటారు. కొన్ని సార్లు ఉదయం అలసట కూడా డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. దీన్ని అదిగమించడం కోసం సరైన ఆహారాలు తీసుకోవడం మంచిది
సంబంధిత కథనం