Herbs for UTIs | మూత్ర వ్యవస్థలో ఇబ్బందులా? ఈ మూలికలతో సత్వర ఉపశమనం!-treat urinary tract infections at home with these effective remedies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Herbs For Utis | మూత్ర వ్యవస్థలో ఇబ్బందులా? ఈ మూలికలతో సత్వర ఉపశమనం!

Herbs for UTIs | మూత్ర వ్యవస్థలో ఇబ్బందులా? ఈ మూలికలతో సత్వర ఉపశమనం!

Jul 14, 2022, 10:10 PM IST HT Telugu Desk
Jul 14, 2022, 10:10 PM , IST

  • మూత్ర వ్యవస్థలో భాగంగా ఉండే కిడ్నీలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, అలాగే మూత్రమార్గంలో ఏ చోటనైనా సంభవించే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా స్త్రీలలో మూత్రనాళం చిన్నగా ఉంటుంది కాబట్టి వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకితే తరచుగా మూత్రవిసర్జన చేయడం, ముదురు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, పెల్విక్ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. UTI లకు చికిత్స చేయడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంట్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్‌ని నయం చేయడానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.

(1 / 7)

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా స్త్రీలలో మూత్రనాళం చిన్నగా ఉంటుంది కాబట్టి వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకితే తరచుగా మూత్రవిసర్జన చేయడం, ముదురు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, పెల్విక్ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. UTI లకు చికిత్స చేయడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంట్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్‌ని నయం చేయడానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.(Pexels)

Bangshil: ఈ మూలికను తీవ్రమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు ఇస్తారు. ఇది యాంటీ సెప్టిక్ ఔషధం. దీనిని ప్రోస్టాటోమెగలీ, యూరిటిస్, వర్జినిటీస్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది.

(2 / 7)

Bangshil: ఈ మూలికను తీవ్రమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు ఇస్తారు. ఇది యాంటీ సెప్టిక్ ఔషధం. దీనిని ప్రోస్టాటోమెగలీ, యూరిటిస్, వర్జినిటీస్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది.(Unsplash)

Punarnava: ఈ మూలిక రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మూత్రవిసర్జనపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంటను మంటను తగ్గిస్తుంది, మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది.

(3 / 7)

Punarnava: ఈ మూలిక రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మూత్రవిసర్జనపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంటను మంటను తగ్గిస్తుంది, మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది.(Pinterest)

Gokshur: గోక్షుర్ అనేది ఒక ఔషధ మొక్క. దీని ఆకులను ఎండబెట్టి, చూర్ణం చేసి, తర్వాత గోరువెచ్చని నీరు లేదా తేనెతో సేవిస్తారు. ఇది శరీరంలో వాపు అలాగే మూత్రనాళం, మూత్రాశయం వద్ద వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

(4 / 7)

Gokshur: గోక్షుర్ అనేది ఒక ఔషధ మొక్క. దీని ఆకులను ఎండబెట్టి, చూర్ణం చేసి, తర్వాత గోరువెచ్చని నీరు లేదా తేనెతో సేవిస్తారు. ఇది శరీరంలో వాపు అలాగే మూత్రనాళం, మూత్రాశయం వద్ద వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.(Pinterest)

Guduchi: ఈ హెర్బ్ వైరల్ జ్వరం, ఫ్లూ ఇంకా UTI నొప్పి వంటి అనేక సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇతర మూలికల మాదిరిగానే, దీనిని కూడా గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ సమయంలోనైనా శరీరానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

(5 / 7)

Guduchi: ఈ హెర్బ్ వైరల్ జ్వరం, ఫ్లూ ఇంకా UTI నొప్పి వంటి అనేక సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇతర మూలికల మాదిరిగానే, దీనిని కూడా గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ సమయంలోనైనా శరీరానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.(Pinterest)

Varunasava: వరుణసవలోని మూత్రవిసర్జన గుణాలు మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. దీనిని గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.

(6 / 7)

Varunasava: వరుణసవలోని మూత్రవిసర్జన గుణాలు మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. దీనిని గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.(Pinterest)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు