తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Boiled Egg Omelette : ఉడకబెట్టిన ఎగ్స్​తో ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోతుంది..

Boiled Egg Omelette : ఉడకబెట్టిన ఎగ్స్​తో ఆమ్లెట్.. టేస్ట్ అదిరిపోతుంది..

09 September 2022, 7:35 IST

    • Boiled Egg Omelette : చాలామంది ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. ఉదయాన్నే త్వరగా చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్​లలో ఇది కూడా ఒకటి. అయితే మీరు ఆమ్లెట్ ప్రియులైతే.. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్​ని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఒక్కసారి తింటే దానితో కచ్చితంగా లవ్​లో పడతారు కాబట్టి. 
బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్
బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్

బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్

Boiled Egg Omelette : ఉడకబెట్టిన గుడ్లతో ఆమ్లెట్‌. వినడానికి వెరైటీగా ఉన్నా.. తినడానికి మాత్రం బాగుంటుంది. అవును మీరు ఉదయాన్నే టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్ తినాలనుకుంటే.. మీరు హ్యాపీగా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తినేయొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

కావాల్సిన పదార్థాలు

* గుడ్లు - 3

* ఉడికించిన గుడ్లు - 3 (గుండ్రంగా కట్ చేసుకోవాలి)

* పచ్చిమిర్చి - 3-4 (తరిగినవి)

* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్ (తరిగినది)

* ఉల్లిపాయ (మీడియం) - 1 (ముక్కలుగా కోయాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* కారం - 1 టేబుల్ స్పూన్

* చాట్ మసాలా - అర టీస్పూన్

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

ముందుగా గిన్నె తీసుకుని దానిలో గుడ్లను పగుల గొట్టి వేయాలి. ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం స్టౌవ్​ మీద పాన్ పెట్టాలి. అది వేడి అయిన తర్వాత.. గుడ్ల మిశ్రమాన్ని దానిపై పోయాలి.

దానిపైన గుండ్రంగా కట్ చేసిన ఉడికించిన గుడ్లను ప్లేస్ చేయాలి. వాటిపై కొద్దిగా చాట్ మసాలా, కారం, రుచికి తగినంత ఉప్పు చల్లుకోండి. 3.5-10 నిమిషాలు మూతపెట్టి. ఆమ్లెట్‌ను మరొక వైపునకు తిప్పండి. తదుపరి 5-10 నిమిషాలు దానిని ఉడికించండి. తురిమిన చీజ్ ఉంటే వేసి.. వేడి వేడిగా ఆస్వాదించండి.

టాపిక్