Breakfast Recipe : స్వీట్ తినాలనే కోరికను ఇలా హెల్తీగా తీర్చుకోండి..
02 September 2022, 7:40 IST
- Crunchy Ragi and Oats Breakfast Bowl : మీకు స్వీట్ టూత్ ఉందా? కానీ స్వీట్లు తగ్గించడమే మీ లక్ష్యమా? ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు స్వీట్స్‌ని పక్కన పెట్టేస్తాము. కానీ స్వీట్ క్రావింగ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు మీరు క్రంచీ రాగి & ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ బౌల్‌ను తినొచ్చు. ఇది మీకు ఏ అపరాధం లేకుండా మీ స్వీట్ టూత్‌ను సంతృప్తి పరుస్తుంది. పైగా ఇది హెల్తీ రెసిపీ కూడా.
క్రంచీ రాగి & ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్
Crunchy Ragi and Oats Breakfast Bowl : క్రంచీ రాగి & ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ బౌల్ అనేది ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం ఎంపిక. దీనిని మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. లేదా టీ టైమ్ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. దీనిలో చక్కెర వేయము కాబట్టి.. మీరు చక్కెరను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. పైగా దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* రాగి పిండి - 1 టేబుల్ స్పూన్
* వోట్స్ - 2 టేబుల్ స్పూన్లు
* నీరు - 1/8 కప్పు
* పాలు - 1/2 కప్పు
* తేనె - రుచికి సరిపడినంత
* మల్టీగ్రెయిన్ డైజెస్టివ్ రాగి బిస్కెట్లు - 4 (ముక్కలుచేయాలి)
* బాదం ముక్కలు - 1 టేబుల్ స్పూన్
* పిస్తా - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
క్రంచీ రాగి & ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ బౌల్ రెసిపీని తయారు చేయడానికి.. ముందుగా ఒక బాణి తీసుకొని.. స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. దానిలో రాగిపిండి, ఓట్స్, నీరు, పాలు, తేనె వేసి బాగా కలపాలి. అది చిక్కబడే వరకు ఉడికించాలి. మిశ్రమం రెడీ అయిన తర్వాత.. స్టవ్ ఆపేసి దానిని చల్లారనివ్వాలి.
ఇప్పుడు జార్ తీసుకుని న్యూట్రిచాయిస్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఎసెన్షియల్స్ రాగి బిస్కెట్లను వేయాలి. ఆ పైన రాగి & ఓట్స్ గంజిని కొంచెం వేయాలి. దానిపైన కొన్ని తరిగిన బాదం, పిస్తాలను వేసుకోవాలి. ఇలా జార్ నిండే వరుకు లేయర్లుగా వేసుకోవాలి. అంతే క్రంచీ రాగి & ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ.