Breakfast Recipe : పోషకాలకు పవర్‌హౌస్.. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ..
01 September 2022, 7:56 IST
- Breakfast Recipe : మరి ఇంత ఈజీనా అనిపించేలా తయారు చేసుకోగలిగే ఓ రెసిపీ.. మీ ఆకలిని తీరుస్తుంది.. హెల్త్‌కి మంచిది అంటే కచ్చితంగా దానిని తయారు చేసుకుంటారు కదా. అయితే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ కచ్చితంగా అలాంటిదే. పెద్దగా సమయం పట్టదు. హెల్త్‌కి మంచిది. పైగా టేస్టీ కూడా.
పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ
Breakfast Recipe : ఆరోగ్యానికి పండ్లు మంచివని తెలుసు. అయితే కొన్నిసార్లు డైరక్ట్‌గా తినడం కన్నా స్మూతీలు చేసుకుంటే మంచిది. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ గురించి. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. పైగా హెల్తీ రెసిపీ కూడా. ఈ స్మూతీ రెసిపీ ఆరోగ్యకరమైన పోషకాలకు పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. కాబట్టి మీ వర్క్ అవుట్ తర్వాత హ్యాపీగా దీనిని తీసుకోవచ్చు. పైగా ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
కావాల్సిన పదార్థాలు
* స్ట్రాబెర్రీలు - 100 గ్రాములు (తాజావి)
* తేనె - 1 టేబుల్ స్పూన్
* లో ఫ్యాట్ పెరుగు - 150 గ్రాములు
* పుచ్చకాయ - 50 గ్రాములు
టాపింగ్ కోసం
* చియా సీడ్స్ - పావు కప్పు (నానబెట్టినవి)
తయారీ విధానం
పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, పెరుగు, తేనే అన్ని కలిపి బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. స్మూతీలా వచ్చే వరకు బ్లెండ్ చేయాలి. దానిని గ్లాస్‌లో పోయాలి. దీనిని చల్లగా తీసుకోవాలంటే ఫ్రిజ్‌లో కొంతసేపు ఉంచాలి. లేదంటే డైరక్ట్‌గా తినొచ్చు. కానీ తినే ముందు చియా సీడ్స్‌తో టాపింగ్ చేసుకోవాలి. అంతే హెల్తీ, టేస్టీ స్మూతీ రెడీ.