Home Exercises | ఫిట్‌గా ఉండాలటే ఇంట్లో ఉండే ఈ మూడు వ్యాయామాలు చేయండి!-try these at home workout routines effective for fat burning
Telugu News  /  Lifestyle  /  Try These At-home Workout Routines Effective For Fat Burning
Jumping Jacks
Jumping Jacks (Unsplash)

Home Exercises | ఫిట్‌గా ఉండాలటే ఇంట్లో ఉండే ఈ మూడు వ్యాయామాలు చేయండి!

17 July 2022, 6:39 ISTHT Telugu Desk
17 July 2022, 6:39 IST

కొవ్వు కరిగించటానికి ఉపయోగపడే వ్యాయామాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఉండే చేయగల మూడు సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామాలు ఇక్కడ పేర్కొన్నాం.

ఫిట్‌గా ఉండాలనే కోరిక ఉంటే ఏ విధంగా అయినా ఫిట్‌నెస్ సాధించవచ్చు. ఇందుకు మీకు కావాల్సింది వ్యాయామాలు చేయాలనే ప్రేరణ, దృఢమైన ఫిట్‌నెస్ లక్ష్యాన్ని కలిగి ఉండటం. మీరు ఇంట్లో ఉండి కూడా సులభమైన వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్ సాధించవచ్చు. ఈ వర్షాకాలంలో బయట ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతారు. అయితే ఇంటివద్ద కూడా మీ కసరత్తులు ఆపకూడదు. ఫిట్‌గా ఉండటానికి, మీరు తప్పనిసరిగా మీ వ్యాయామ సెషన్‌లను షెడ్యూల్ చేసి ఉండాలి. సరైన ఆహార నియమాలను పాటించాలి. మీ నడుము పరిమాణాన్ని తగ్గించుకోవడానికి శరీరానికి శ్రమ కల్పించండి. తెలివైన మార్గాల ద్వారా సులభంగా ఫ్యాట్ తగ్గించుకోండి.

శక్తివంతంగా ఉండే 3 ఫ్యాట్ బర్నింగ్ హోమ్ వ్యాయామాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ ఇంటి వద్ద రోజూ సాధన చేయండి.

జంపింగ్ జాక్స్

పవర్-ప్యాక్డ్ జంపింగ్ జాక్‌లు సులభంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, వీటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయవద్దు. వీటితో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉత్తమ కార్డియో వ్యాయామాలలో ఇది కూడా ఒకటి.

జంపింగ్ జాక్స్ మీ శరీరం నుండిచి మొండి కొవ్వును కరిగించడంలో సహయపడతాయి. ఇవి ఒక ఇంటెన్స్ వర్కౌట్. కాబట్టి ఈవ్యాయామం చేస్తునప్పుడు ఎక్కువ మొత్తంలో కేలరీలు బర్న్ అవుతాయి.

అంతేకాకుండా, ఈ వ్యాయామం శరీరం జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కండరాలలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కాబట్టి జంపింగ్ జాక్స్ మీ డైలీ రొటీన్లో చేర్చుకోండి. ఇవి మీ అధిక బరువు తగ్గించడంలో సహాయపడతాయి.

జంపింగ్ రోప్స్ లేదా స్కిప్పింగ్:

ఒక తాడు తీసుకొని 15-20 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి. ఇది ఎంతో ఉల్లాసవంతమైన వ్యాయామం. రోజూ ఉదయం, సాయంత్రం స్కిప్పింగ్ చేయడం ద్వారా మీ శరీరం నుంచి మంచి మొత్తంలో కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ ప్రకారంగా అనవసరమైన కొవ్వును కరిగించవచ్చు.

కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఇది ప్రభావవంతమైన వ్యాయామం. కాబట్టి కచ్చితంగా ఇది మీ డైలీ వర్కౌంట్లో భాగంగా స్కిప్పింగ్ చేర్చుకోండి.

బర్పీస్

ఇది కూడా ఒక పవర్-ప్యాక్డ్ వర్కవుట్ కావడంతో కొవ్వును కాల్చడంలో బర్పీస్ ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం అవుతుంది.

బర్పీస్ ద్వారా మొత్తం శరీరానికి తగిన వ్యాయామం లభిస్తుంది.

ఇందులో జంపింగ్ చేయడం, పుషప్స్, పులప్స్ చేయడం లాంటివి ఉంటాయి. కాబట్టి ఇది కార్డియో వ్యాయామంలాగా కూడా పనిచేస్తుంది.

అందుకే జిమ్ శిక్షకులు, నిపుణులు కూడా బర్పీలు చేయమని సూచిస్తారు

బర్పీలుమీ శరీరాన్ని టోన్ చేయడానికి, బరువు తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడంలో మీకు సహాయపడే అత్యంత శక్తివంతమైన వ్యాయామం.

సంబంధిత కథనం

టాపిక్