Breakfast Recipe : మీ ఉదయాన్ని జొన్న దోశతో ప్రారంభించండి.. వెరీ ఈజీ రెసిపీ..
30 August 2022, 7:43 IST
- Breakfast Recipe : జొన్నరొట్టె హెల్త్‌కి చాలా మంచిది అంటారు. పైగా దీనిని చాలామంది తమ డైట్లో భాగంగా చేసుకుంటారు. అయితే మీ ఉదయాన్ని కూడా జొన్నపిండితో ప్రారంభించాలి అనుకుంటే.. జొన్న దోశను ప్రయత్నించవచ్చు. ఇది సులభమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.
జొన్న దోశ
Breakfast Recipe : మీ బ్రేక్‌ఫాస్ట్‌ని హెల్తీగా, ఆరోగ్యంగా మార్చుకోవాలంటే జొన్న దోశను ప్రయత్నించాల్సిందే. పైగా ఈ క్రిస్పీ దోశ మీకు అదిరిపోయే టేస్ట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. 15 నిముషాలలో పిండిని తయారు చేసుకోవచ్చు. మీ బిజీ షెడ్యూల్లో ఇది మీకు మంచి కంపెనీ ఇస్తుంది. మరి ఈ దోశను ఎలా తయారు చేయాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* జొన్న పిండి - 1½ కప్పు
* ఉప్పు - తగినంత
* నీరు - 4 కప్పులు
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - కొన్ని (తరిగిన)
* పశ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
* జీలకర్ర - 1 tsp
* మిరియాల పొడి - అర tsp
* నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండిని తీసుకోండి. పిండి తాజాగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దోసె క్రిస్పీగా రాదు. దానిలో ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా చూసుకుంటూ బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పశ్చిమిర్చి, జీలకర్ర, పెప్పర్ పొడి వేసి బాగా కలపండి.
ఈ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. తరువాత మీరు పిండిని నీళ్లుగా.. దోశ పిండి మాదిరిగా కనిపిస్తుంది. కాస్త చిక్కగా ఉంది అనిపిస్తే మరింత నీరు పోసి.. దోశ స్థిరత్వాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ ఉంచండి. అది బాగా వేడిగా ఉన్నప్పుడు.. పాన్ మీద పిండి పోయాలి. చుట్టు పక్కలా నూనె వేయాలి. 3 నిమిషాలు లేదా దోస మంచిగా మారే వరకు కాల్చండి. చివరిగా.. చట్నీతో క్రిస్పీ జొన్న దోశను సర్వ్ చేసుకుని ఆస్వాదించండి.