Breakfast Recipe : శెనగపిండితో పకోడీలు, బజ్జీలు చేసుకోవచ్చు. అయితే ఈ పిండితో ఉదయాన్నే కమ్మని దోశలు కూడా వేసుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు. మనకి నచ్చిన కూరగాయలతో.. మీరు హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవచ్చు. అదే శెనగపిండి దోశ. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఫైబర్ అధికంగా ఉండే ఈ శెనగపిండి దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ,కావాల్సిన పదార్థాలు* శెనగ పిండి - 1 కప్పు,* వామ్ము - 1 స్పూన్,* కరివేపాకు - 1 స్పూన్,* పసుపు - అర టీస్పూన్,* ఉప్పు - తగినంత,* నూనె - తగినంత,* కారం - 1 స్పూన్,* ఇంగువ - నచ్చితే వేసుకోవచ్చు (కొంచెం),తయారీ విధానంఒక పెద్ద గిన్నె తీసుకుని.. దానిలో శెనగపిండి, పసుపు, వామ్ము, ఉప్పు, కారం, ఇంగువ వేసి బాగా కలపాలి. అనంతరం ఉండలు లేకుండా నీరు పోస్తూ.. పిండిని బాగా కలపాలి. ,ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. నాన్ స్టిక్ పాన్‌ను వేడి చేయాలి. పాన్ వేడి కాగానే గరిటె నిండా పిండిని దోశ మాదిరి వృత్తాకారంలో వేయండి. అంచుల వెంబడి నూనె వేయండి. ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపు తిప్పండి. అంతే చాలా సింపుల్‌గా చేసుకునే శెనగపిండి దోశ రెడీ. అంతేకాకుండా దీనిలో స్పింగ్ ఆనియన్స్, ఉడకబెట్టిన బంగాళదుంపలతో గార్నీష్ చేసుకోవచ్చు. మంచి చట్నీతో హాయిగా లాగించేయవచ్చు.,