తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : బ్రోకలీతో బ్రేక్​ఫాస్ట్.. హెల్తీగా ఉండేందుకు ఇదే బెస్ట్

Breakfast Recipe : బ్రోకలీతో బ్రేక్​ఫాస్ట్.. హెల్తీగా ఉండేందుకు ఇదే బెస్ట్

27 August 2022, 9:00 IST

google News
    • Breakfast Recipe : ఉదయాన్నే హెల్తీ ఆహారం తీసుకోవాలనుకునే వారికి.. గ్రీన్స్ తినేవారికి.. బ్రోకలీ, బాదం సలాడ్ ఓ చక్కని బ్రేక్​ఫాస్ట్ అవుతుంది. మీ వర్కౌట్ తర్వాత తినేందుకు ఇది చక్కని ఆహారం. పైగా ఇది మీరు హెల్తీగా ఉండేలా.. డే అంతా చురుకుగా ఉండేలా సహాయం చేస్తుంది.
బ్రోకలీ, బాదం సలాడ్
బ్రోకలీ, బాదం సలాడ్

బ్రోకలీ, బాదం సలాడ్

Breakfast Recipe : బ్రోకలీ ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. దానిని మరింత హెల్తీగా చేసుకుని డే స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి బ్రేక్​ఫాస్ట్​ అవుతుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బ్రోకలీ - 1 పెద్దది

* వెన్న - 4 టేబుల్ స్పూన్స్

* వెల్లుల్లి - 1 చిన్నది (తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి)

* లవంగాలు - 2

* ఉప్పు - తరిగినంత

* బాదం ముక్కలు - 12 నుంచి 15

తయారీ విధానం

ముందుగా బ్రోకలీని చిన్న చిన్న పుష్పగుచ్ఛాలుగా కత్తిరించండి. అనంతరం బ్రోకలీని రెండు నిమిషాలు ఉడకబెట్టండి. ఒక పెద్ద పాన్‌లో బాదంపప్పును బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి. సుమారు నిమిషాలు వేయించి.. తర్వాత వాటిని పాన్ నుంచి తీసేయండి.

ఇప్పుడు పాన్‌లో వెన్న వేసి.. దానిలో వెల్లుల్లి వేయాలి. అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. లవంగాలు, బ్రోకలిని వేసి.. మరో 2 నిమిషాలు కలపాలి. పాన్‌ను మూతపెట్టి బ్రోకలీ మెత్తబడే వరకు ఉడికించాలి. చివర్లో ఉప్పు వేసి.. వేయించిన బాదంపప్పులతో సర్వ్ చేసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం