Breakfast Recipes : టేస్టీగా, హెల్తీగా, ఈజీగా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే
Muesli Chia Seed Dry Fruit Jar : ఉదయాన్నే ఇంటిల్లిపాదికీ టిఫెన్స్ చేయడం కష్టమైన. పైగా అందరికీ ఒకటే నచ్చదు. పైగా తినేవాటిలో రుచి కావాలి.. హెల్తీగా ఉండాలి అనుకుంటారు. మీ ఫ్యామిలిలో కూడా అదే అయితే ముయెస్లీ చియా సీడ్ డ్రై ఫ్రూట్ జార్ ట్రై చేయాల్సిందే. పైగా ఇది ఎక్కువ సమయం కూడా తీసుకోదు. చిన్న పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ హాయిగా తినొచ్చు.
Muesli Chia Seed Dry Fruit Jar : హెల్తీ ఫుడ్ తీసుకోవడం అందరికీ మంచిదే. కానీ ఉదయాన్నే అలాంటి వంటకాలు చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే టేస్టీగా, హెల్తీగా, ఈజీగా రెడీ చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉంటే ఎవరూ కాదంటారు చెప్పండి. మీరు కూడా ఇలాంటి హెల్తీ.. టేస్టీ ఫుడ్‌ని తినాలనుకుంటే ముయెస్లీ చియాసీడ్ డ్రై ఫ్రూట్ జార్‌ను ట్రై చేయండి. మీది బిజీ లైఫ్ అయినా.. దీనిని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ముయెస్లీ - 100 గ్రాములు
* చియా విత్తనాలు - 50 గ్రాములు ½(కప్పు నీటిలో నానబెట్టాలి)
* పెరుగు - 1/2 కప్పు
* దాల్చిన చెక్క పొడి - 1 టీస్పూన్
* అరటిపండ్లు - 2 (ముక్కలు కట్ చేసుకోవాలి)
* తేనె - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* ఎండు ద్రాక్షలు - 1 టేబుల్ స్పూన్
* దానిమ్మ గింజలు - 1 స్పూన్
తయారీ విధానం..
ముయెస్లీ అంటే వోట్స్,తృణధాన్యాలు, డ్రై సీడ్స్ మిశ్రమం. దీనిలో పాలు కలిపి ఎక్కువమంది అల్పాహారంగా తీసుకుంటారు. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని.. దానిలో పెరుగు వేసి.. చియాగింజలు వేసి కలపండి. అనంతరం ముయెస్లీ వేసి బాగా కలపండి. దాల్చిన చెక్కపొడి, తేనే, ఉప్పు, ఎండుద్రాక్షలు, దానిమ్మ గింజలు, అరటిపండ్లు వేసి బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
ముయెస్లీ చియా సీడ్ డ్రై ఫ్రూట్ జార్ ఆరోగ్యకరమైన అల్పాహారం. కాబట్టి దీనిని పెద్దల నుంచి పిల్లలవరకు ఎటువంటి ఇబ్బందిలేకుండా హాయిగా లాగించేయవచ్చు.
సంబంధిత కథనం