Breakfast Recipe : హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినాలనుకుంటే.. వెజ్ గ్రిల్డ్ శాండ్‌విచ్ బెస్ట్
Today Breakfast Recipe : ఉదయాన్నే సింపుల్‌గా, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినాలని అందరికీ ఉంటుంది. అలా అనుకునేవారు వెజ్ గ్రిల్డ్ శాండ్‌విచ్(Veg Grilled Sandwich)ని తయారు చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం ఈజీనే. టేస్ట్ బాగుంటుంది. పైగా ఎక్కువ కూరగాయాలు కలిపి తీసుకుంటాము కాబట్టి హెల్త్‌కి కూడా మంచిదే.
Today Breakfast Recipe : చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా శాండ్‌విచ్ తీసుకుంటారు. కానీ ఇంట్లో దానిని ఎలా తయారు చేసుకోవాలో వారికి సరిగా తెలియదు. అయితే మీ శాండ్‌విచ్‌ని మరింత టేస్టీగా మార్చుకోవాలనుకుంటే.. మీరు వెజ్ గ్రిల్డ్ శాండ్‌విచ్ (Veg Grilled Sandwich)ని ట్రై చేయాలి. దీనిని తయారు చేయడం కూడా సులువే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బ్రెడ్ - 6 స్లైస్
* ఉల్లిపాయ - 1
* బంగాళదుంప - 1 (ఉడికించినది)
* క్యాప్సికమ్ - 1 చిన్నది లేదా పెద్ద దానిలో సగం
* కీర దోస - 1 చిన్నది
* క్యారెట్ - 1
* పనీర్ - 100 గ్రాములు (తురిమినది)
* చీజ్ - 4 స్లైస్
* మయోన్నైస్ - 4 స్పూన్స్
* ఉప్పు - తగినంత
* టమోట సాస్ - మీకు నచ్చినంత
* బ్లాక్ పెప్పర్ - ఇష్టం ఉంటే వేసుకోవచ్చు (ఆప్షనల్)
తయారీ విధానం
ముందుగా కీర దోసకాయ, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లను స్లైస్‌లుగా కట్ చేసుకోవాలి. అనంతరం తురిమిన క్యారెట్, పనీర్ కలపాలి. దానిలో మయోన్నైస్ వేసి.. టొమాటో సాస్‌తో బ్రెడ్ ముక్కలను స్మెర్ చేయండి. దానిపై సాల్ట్, బ్లాక్ పెప్పర్ చల్లండి.
ఇలా బేస్ తయారుచేసుకున్నాక.. బ్రెడ్‌పై కూరగాయలను ప్లేస్ చేయండి. దానిపై తురిమిన క్యారెట్, పనీర్‌ను ఉంచండి. దానిపై చీజ్ స్లైస్ వేయండి. మరో బ్రెడ్ స్లైస్‌తో ఈ స్టఫ్‌ను కప్పి.. బటర్‌తో గ్రిల్ చేయండి. వెరీ హెల్తీ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ మీ సొంతం. హ్యాపీగా లాగించేయండి.
సంబంధిత కథనం