Breakfast Recipe : ప్రొటీన్ బ్రేక్​ఫాస్ట్ కావాలనుకుంటే.. స్ట్రాబెర్రీ స్మూతీ తాగండి-today breakfast recipe is strawberry smoothie here is the ingredients and process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : ప్రొటీన్ బ్రేక్​ఫాస్ట్ కావాలనుకుంటే.. స్ట్రాబెర్రీ స్మూతీ తాగండి

Breakfast Recipe : ప్రొటీన్ బ్రేక్​ఫాస్ట్ కావాలనుకుంటే.. స్ట్రాబెర్రీ స్మూతీ తాగండి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 10, 2022 07:28 AM IST

Strawberry Smoothie : జిమ్​కి లేదా వ్యాయామాలు చేసేవారు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేందుకు ప్రిఫర్ చేస్తారు. అయితే జిమ్​లో కసరత్తులు చేసి ఇంటికి వచ్చాక.. ప్రొటీన్​ తీసుకోవాలి అనుకునేవారు ఈ స్ట్రాబెర్రీ స్మూతీని ట్రై చేయాలి. దీనిని తయారు చేయడం సులభమే. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.

<p>స్ట్రాబెర్రీ స్మూతీ</p>
స్ట్రాబెర్రీ స్మూతీ

Strawberry Smoothie : మీరు తక్కువ సమయంలో రుచికరమైన, ప్రొటీన్​తో కూడిన రెసిపీని ట్రై చేయాలనుకుంటే.. మీరు హ్యాపీగా స్ట్రాబెర్రీ స్మూతీని ప్రయత్నించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. ఈ స్మూతీ పైనాపిల్, బాదం పాలు, స్ట్రాబెర్రీ, ప్రొటీన్​తో కలిపి తయారు చేస్తారు. పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ప్రొటీన్ స్మూతీ తయారికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పైనాపిల్ - 2 స్లైసెస్

* స్ట్రాబెర్రీస్ - 3-4

* స్కిమ్డ్ లేదా బాదం పాలు - 1 గ్లాస్

* ఎండుద్రాక్ష - 5 (నానబెట్టినవి)

* ప్రొటీన్ - 1 స్కూప్

* ఐస్ క్యూబ్స్ - 3-4

స్ట్రా ప్రోటీన్ స్మూతీ తయారీ విధానం..

బ్లెండర్​లో పైనాపిల్, స్ట్రాబెర్రీస్, బాదంపాలు, ఎండుద్రాక్ష, ప్రొటీన్, ఐస్ క్యూబ్స్ వేసి.. బాగా బ్లెండ్ చేయాలి. ఇవి మంచి స్మూతీగా అయ్యేవరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. అనంతరం దీనిని ఓ గ్లాసులో సర్వ్ చేసి.. హ్యాపీగా లాగించేయండి. టేస్ట్​కి టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

Whats_app_banner

సంబంధిత కథనం