ఈ 6 లక్షణాలు కనిపిస్తున్నాయా.. తగిన ప్రొటీన్‌ తీసుకోవడం లేదని అర్థం!-6 signs you are not getting enough protein ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 6 లక్షణాలు కనిపిస్తున్నాయా.. తగిన ప్రొటీన్‌ తీసుకోవడం లేదని అర్థం!

ఈ 6 లక్షణాలు కనిపిస్తున్నాయా.. తగిన ప్రొటీన్‌ తీసుకోవడం లేదని అర్థం!

Jan 26, 2022, 04:35 PM IST HT Telugu Desk
Jan 24, 2022, 10:28 AM , IST

  • మన శరీరంలో కణాలను సృష్టించాలన్నా, ఉన్నవాటిని రిపేర్‌ చేయాలన్నా.. ప్రొటీన్‌ ఎంతో అవసరం. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కూడా బ్యాలెన్స్‌ చేస్తుంది. ఒకవేళ మీరు రోజూ తగిన ప్రొటీన్‌ తీసుకోకపోతే మీలో ఈ 6 లక్షణాలు కనిపిస్తాయని న్యూట్రిషనిస్ట్‌ మినాషి పెట్టుకోలా చెబుతున్నారు.

మీ థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు రిలీజ్‌ కావాలననా, మీ బ్లడ్‌ షుగర్‌ బ్యాలెన్స్‌ చేయాలన్నా.. ప్రొటీన్‌ చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ప్రొటీన్‌ అందించే ఆహారం తగిన స్థాయిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీరు ప్రొటీన్‌ తగినంత తీసుకోకపోతే మీలో కనిపించి 6 లక్షణాలు ఏంటో న్యూట్రిషనిస్ట్‌ మినాషి పెట్టుకోలా చెబుతున్నారు.

(1 / 7)

మీ థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు రిలీజ్‌ కావాలననా, మీ బ్లడ్‌ షుగర్‌ బ్యాలెన్స్‌ చేయాలన్నా.. ప్రొటీన్‌ చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ప్రొటీన్‌ అందించే ఆహారం తగిన స్థాయిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీరు ప్రొటీన్‌ తగినంత తీసుకోకపోతే మీలో కనిపించి 6 లక్షణాలు ఏంటో న్యూట్రిషనిస్ట్‌ మినాషి పెట్టుకోలా చెబుతున్నారు.(Pixabay)

ఎప్పుడూ ఆకలిగానే ఉండటం: తినే ఆహారంలో తగిన ప్రొటీన్‌ ఉంటే చాలాసేపటి వరకు పొట్ట ఫుల్‌గా ఉన్న భావన కలుగుతుంది. అయితే ప్రొటీన్‌ తగినంత తీసుకోకపోతే పొట్ట ఖాళీగా అనిపించి ఎప్పుడూ ఆకలి వేస్తూ ఉంటుంది.

(2 / 7)

ఎప్పుడూ ఆకలిగానే ఉండటం: తినే ఆహారంలో తగిన ప్రొటీన్‌ ఉంటే చాలాసేపటి వరకు పొట్ట ఫుల్‌గా ఉన్న భావన కలుగుతుంది. అయితే ప్రొటీన్‌ తగినంత తీసుకోకపోతే పొట్ట ఖాళీగా అనిపించి ఎప్పుడూ ఆకలి వేస్తూ ఉంటుంది.(Pixabay)

బ్లడ్‌ షుగర్‌ అసమతుల్యత: డయాబెటిస్‌ లేదా షుగర్‌ వ్యాధితో బాధపడేవారికి ప్రొటీన్‌ కచ్చితంగా అవసరం. పప్పు, రాజ్మా, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటే తగిన ప్రొటీన్ అందుతుంది. ఒకవేళ ప్రొటీన్‌ తగిన స్థాయిలో తీసుకోకపోతే బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అసమతుల్యంగా ఉంటాయి.

(3 / 7)

బ్లడ్‌ షుగర్‌ అసమతుల్యత: డయాబెటిస్‌ లేదా షుగర్‌ వ్యాధితో బాధపడేవారికి ప్రొటీన్‌ కచ్చితంగా అవసరం. పప్పు, రాజ్మా, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకుంటే తగిన ప్రొటీన్ అందుతుంది. ఒకవేళ ప్రొటీన్‌ తగిన స్థాయిలో తీసుకోకపోతే బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అసమతుల్యంగా ఉంటాయి.(Pixabay)

పెళుసైన గోర్లు: మన కండరాలు, చర్మం, హార్మోన్లకు ప్రొటీన్లు చాలా అవసరం. ఒకవేళ తగిన ప్రొటీన్‌ తీసుకోకపోతే ఆ ప్రభావం మీ చర్మం, జుట్టు, గోర్లపై పడుతుంది. మీ గోర్లు పెళుసుగా కనిపిస్తున్నాయంటే ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించండి.

(4 / 7)

పెళుసైన గోర్లు: మన కండరాలు, చర్మం, హార్మోన్లకు ప్రొటీన్లు చాలా అవసరం. ఒకవేళ తగిన ప్రొటీన్‌ తీసుకోకపోతే ఆ ప్రభావం మీ చర్మం, జుట్టు, గోర్లపై పడుతుంది. మీ గోర్లు పెళుసుగా కనిపిస్తున్నాయంటే ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించండి.(Shutterstock)

జుట్టు రాలుతుంది: శరీరానికి తగిన ప్రొటీన్‌ అందకపోతే మీ జుట్టు చాలా డల్‌గా కనిపిస్తూ బలహీనంగా మారుతుంది. ఒకవేళ మీ జుట్టు రాలిపోతుంటే ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలి.

(5 / 7)

జుట్టు రాలుతుంది: శరీరానికి తగిన ప్రొటీన్‌ అందకపోతే మీ జుట్టు చాలా డల్‌గా కనిపిస్తూ బలహీనంగా మారుతుంది. ఒకవేళ మీ జుట్టు రాలిపోతుంటే ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలి.(Shutterstock)

గాయాలు మెల్లగా మానుతాయి: ప్రొటీన్‌ మన చర్మంతోపాటు కణజాలాన్ని రిపేర్‌ చేస్తుంది. ప్రొటీన్‌ సరిగా తీసుకోకపోతే శరీరానికి తగిలిన గాయాలు త్వరగా మానవు.

(6 / 7)

గాయాలు మెల్లగా మానుతాయి: ప్రొటీన్‌ మన చర్మంతోపాటు కణజాలాన్ని రిపేర్‌ చేస్తుంది. ప్రొటీన్‌ సరిగా తీసుకోకపోతే శరీరానికి తగిలిన గాయాలు త్వరగా మానవు.(Shutterstock)

అలసటగా ఉంటుంది: రోజూ తగిన ప్రొటీన్‌ తీసుకోకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా అలసటగా అనిపిస్తుంది.

(7 / 7)

అలసటగా ఉంటుంది: రోజూ తగిన ప్రొటీన్‌ తీసుకోకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా అలసటగా అనిపిస్తుంది.(Shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు