Breakfast Recipes : శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి.. ఈ స్మూతీని ట్రై చేయండి..
Breakfast Recipes : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో.. ఆహారం చాలా ముఖ్యమైనది. మనం తీసుకునే ఆహారం మీదనే మన శరీర తీరు మెరుగుపడుతుంది. ఈ క్రమంలో శరీరాన్ని డిటాక్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఉదయాన్నే శరీరాన్ని డిటాక్స్ చేసే స్మూతీ తీసుకుంటే.. మీ ఆకలి తీరుతుంది. శరీరంలోని విషాలు, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి.
Breakfast Recipes : శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. ఇది మనం లోపలినుంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కచ్చితంగా వారానికి ఒక్కసారి అయినా.. డిటాక్స్ చేసే డ్రింక్స్, స్మూతీలు తీసుకోవడం చాలా మంచిది. ఇది బయటనుంచే కాకుండా.. లోపలి నుంచి కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. మీరు కూడా మీ శరీరాన్ని డిటాక్స్ చేయాలనుకుంటే.. మీకోసం ఇక్కడ ఓ స్మూతీ రెసిపీ ఉంది. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఎక్కువ సమయం కూడా తీసుకోదు. కాబట్టి ఈజీగా తయారు చేసుకుని హెల్తీగా ఉండండి.
కావాల్సిన పదార్థాలు
* కీరదోసకాయ - 1
* కొత్తిమీరు - 1 కప్పు
* నిమ్మకాయ - రసం 2 స్పూన్స్
తయారీ విధానం..
కీరదోసకాయ, కొత్తిమీరు స్మూతీని తయారు చేసుకోవడం చాలా సింపుల్. కీరదోసను ముక్కలుగా చేసి.. కొత్తిమీరతో కలిపి.. బ్లెండ్ చేయాలి. మీకు స్మూతీగా కావాలనుకుంటే స్మూతీకి సరిపడా నీరు పోసి బ్లెండ్ చేయాలి. డ్రింక్‌లా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నీరు పోయాలి. అంతే దీనిలో నిమ్మకాయ రసం పిండుకుని.. పరగడుపున తాగేయండి. ఇది మీ శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడమే కాకుండా.. లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
సంబంధిత కథనం