Breakfast Recipe : అల్పాహారంగా టేస్టీ చాక్లెట్ బనానా స్మూతీ.. ఇది చాలా సింపుల్​ రెసిపీ..-today breakfast recipe is chocolate banana smoothie bowl here is the process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Chocolate Banana Smoothie Bowl Here Is The Process

Breakfast Recipe : అల్పాహారంగా టేస్టీ చాక్లెట్ బనానా స్మూతీ.. ఇది చాలా సింపుల్​ రెసిపీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 25, 2022 07:24 AM IST

Breakfast Recipe : తాజా అరటిపండ్లు, ఎండిన ద్రాక్షలు, వాల్‌నట్‌లతో నిండి మీకు కావాల్సిన పోషకాలను, విటమిన్లను అందిస్తుంది చాక్లెట్ బనానా స్మూతీ బౌల్‌ (Chocolate Banana Smoothie Recipe). అంతేకాకుండా దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం కూడా. జిమ్​కి వెళ్లేవారైనా.. డేని హెల్తీగా, టేస్టీగా స్టార్ట్ చేయాలనుకునే వారైనా దీనిని ట్రై చేయవచ్చు.

చాక్లెట్ బనానా స్మూతీ బౌల్
చాక్లెట్ బనానా స్మూతీ బౌల్

Breakfast Recipe : చాక్లెట్ బనానా స్మూతీ బౌల్ (Chocolate Banana Smoothie Recipe) మీ రోజుకి పరిపూర్ణమైన, ఆరోగ్యకరమైన స్టార్ట్ ఇస్తుంది. ఇది క్రంచీగా.. మీకు పోషణ అందిస్తుంది. పైగా చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కాబట్టి పిల్లలకు టేస్టీగా, ఆరోగ్యకరమైన అల్పాహారం ఇవ్వలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్. పైగా దీనిని తయారు చేయడం చాలా సులభం. చాక్లెట్ బనానా స్మూతీ బౌల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మూతీ కోసం

* అరటిపండ్లు - 3 (ముక్కలుగా తరగాలి)

* పాలు - 1 కప్పు

* పీనట్ బటర్ - 2 టేబుల్ స్పూన్లు

* వోట్మీల్ - 2 టేబుల్ స్పూన్లు

* కోకో పౌడర్ - 1 టేబుల్ స్పూన్

* ఖర్జూరాలు - 4 (గింజలు తీసి తరగాలి)

టాపింగ్ కోసం

* వాల్‌నట్‌- 4 టేబుల్ స్పూన్లు తరిగినవి

* అరటిపండు - 1 ముక్కలు చేసుకోవాలి

* క్రాన్బెర్రీస్ లేదా ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

బ్లెండర్​లో అరటిపండ్లు, పాలు, పీనట్ బటర్, ఓట్స్, కోకో పౌడర్, ఖర్జూరాలను వేసి.. స్మూత్ ప్యూరీలాగా బాగా బ్లెండ్ చేయాలి. అన్ని బాగా బ్లెండ్ అయిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

దానిపై వాల్‌నట్‌లు, అరటిపండు ముక్కలు, క్రాన్‌బెర్రీస్ లేదా ఎండుద్రాక్షలతో టాపింగ్ చేయాలి. దీనిని వెంటనే తీసుకోవచ్చు లేదా.. ఫ్రిజ్​లో ఉంచి.. చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీ రోజుని ఆనందంగా, ఆరోగ్యంగా, టేస్టీగా మార్చడానికి దీనికన్న మంచి అల్పాహారం ఏముంటుంది చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం చేసుకుని ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్