Breakfast Recipe : మీ ఉదయాన్ని టేస్టీగా మార్చే బనానా చాక్లెట్ పాన్‌కేక్స్
Banana Chocolate Pancakes : మీకు బ్రేక్‌ఫాస్ట్‌లో రుచికరంగా ఏదైనా తినాలనిపిస్తే.. బనానా చాక్లెట్ పాన్‌కేక్‌లు మీకు సరైన ఎంపిక. పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టపడతారు. అంతేకాకుండా వీటిని తయారు చేయడం చాలా ఈజీ. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Banana Chocolate Pancakes : అరటిపండుతో కూడిన చాక్లెట్ పాన్‌కేక్‌లు మీ ఉదయం అల్పాహారానికి ఉత్తమమైనవి. పైగా ఇవి టేస్ట్‌కి టేస్ట్నిస్తాయి. వీటికోసం గంటలు గంటలు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకోవచ్చు. మీరు మీ ప్రాధాన్యత, రుచి ప్రకారం ఈ పాన్కేక్స్కు మరిన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు కూడా. వాటిని మీ పిల్లల స్నాక్ బాక్స్ కోసం కూడా హ్యాపీగా ఉపయోగించవచ్చు. మీ ఉదయాన్ని టేస్టీగా చేసే బ్రేక్‌ఫాస్ట్‌ను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* మైదా - 1 కప్పు
* కోకో పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - 1 చిటికెడు
* పాలు - 1 కప్పు
* మజ్జిగ - 3 నుంచి 5 టేబుల్ స్పూన్లు
* వెనీలా ఎసెన్స్ - ఒకటిన్నర టీస్పూన్
* వెన్న - 2 టేబుల్ స్పూన్లు (సాల్టెడ్)
* షుగర్ - 3 టీస్పూన్లు (పొడి)
* వంట సోడా - 1/2 టీస్పూన్
* బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీస్పూన్
* చాక్లెట్ సాస్ - మీ ఇష్టాన్ని బట్టి
* అరటిపండు - 1 (ముక్కలు చేసి పెట్టుకోవాలి)
* వెన్న - సాల్ట్ లేనిది (ఆప్షనల్)
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ గిన్నె తీసుకుని దానిలో మైదా పిండి, కోకో పౌడర్, షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పుతో సహా అన్ని పొడి పదార్థాలను బాగా కలపండి. దానిలో వెనీలా ఎసెన్స్, కరిగించిన వెన్న, మజ్జిగ జోడించండి. ఉండలు లేకుండా పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కాస్ట్ ఐరన్ స్కిల్లెట్‌పై కొంత వెన్నను వేడి చేసి దానిపై పాన్‌కేక్ పిండిని వేయండి.
దానిని రెండు వైపులా ఉడికించాలి. అది రోస్ట్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. కొంచెం చాక్లెట్ సాస్ పైన వేసి.. కొన్ని అరటిపండు ముక్కలతో గార్నీష్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ బనానా చాక్లెట్ పాన్‌కేక్ రెడీ. దీనిని బనానా స్మూతీ లేదా క్యారెట్ జీడిపప్పు స్మూతీతో తీసుకోవచ్చు. ఇది మీకు రుచికరమైన అల్పాహారం ఫీల్ ఇస్తుంది.
సంబంధిత కథనం