తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : వర్షాకాలంలో చిల్ అవుతూ.. బీట్‌రూట్ చిల్లా తినేయండి..

Breakfast Recipe : వర్షాకాలంలో చిల్ అవుతూ.. బీట్‌రూట్ చిల్లా తినేయండి..

08 September 2022, 7:40 IST

    • Beetroot Chilla Recipe : మీరోజుని మంచి పోషకాలతో నిండిన ఆహారంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. పైగా దీనిని తయారు చేయడం చాలా ఈజీ కూడా. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. అదే బీట్‌రూట్ చిల్లా. దీనిని తయారు చేసుకోవడం చాలా సింపుల్.
బీట్‌రూట్ చిల్లా
బీట్‌రూట్ చిల్లా

బీట్‌రూట్ చిల్లా

Beetroot Chilla Recipe : మీరు విభిన్నమైన అల్పాహారాన్ని ప్రయత్నించాలనుకున్నప్పుడు బీట్‌రూట్ చిల్లా బెస్ట్ రెసిపీ అవుతుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది. అంతేకాకుండా చాలా ఈజీగా దీనిని తయారు చేయవచ్చు. ఈ వంటకంలో బీట్‌రూట్‌ ఉపయోగిస్తాము కాబట్టి.. ఇది మీ ఆరోగ్యానికి వివిధ మార్గాల్లో సహాయపడే పోషకాలను అందిస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బీట్‌రూట్ - 1

* శెనగపిండి - అరకప్పు

* కారం - 1 టీ స్పూన్

* పెప్పర్ - 1 టీ స్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

బీట్‌రూట్ చిల్లా తయారీ విధానం

బీట్‌రూట్‌ను తీసుకుని.. దానిని ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. అది ప్యూరీగా మారే వరకు గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి.. బీట్‌రూట్ ప్యూరీ, ఉప్పు, పెప్పర్, కారం వేసి బాగా కలపాలి. దీనిని ఓ 10 నిముషాలు పక్కన పెట్టేయాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిపై కాస్త నూనె వేసి.. ఈ మిశ్రమాన్ని వేయాలి. దానిని మంచిగా ఉడికించాలి. అది ఉడికిందని నిర్ధారించుకున్నాక.. తీసి హ్యాపీగా ఆస్వాదించేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ బీట్‌రూట్ చిల్లా ఆరోగ్యానికి చాలా మంచిది.

టాపిక్