తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : మలై టోస్ట్.. ఒక్కసారి తింటే అవుతుంది మీ ఫెవరెట్

Breakfast Recipe : మలై టోస్ట్.. ఒక్కసారి తింటే అవుతుంది మీ ఫెవరెట్

06 September 2022, 7:53 IST

google News
    • Malai Toast : ఉదయాన్నే సింపుల్​గా తయారు చేసుకోగలిగే అల్పాహారాలలో ఒకటి బ్రెడ్ టోస్ట్. అయితే దీనిని మలైతో కలిపి తీసుకుంటే ఆహా అనాల్సిందే. మరి సింపుల్, టేస్టీ మలై టోస్ట్​ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
మలై టోస్ట్
మలై టోస్ట్

మలై టోస్ట్

Malai Toast : రుచికరమైన టోస్ట్ ఏ సమయంలోనైనా మీ మనసు దోచేస్తుంది. రుచికరం అంటే ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటున్నారెమో.. చాలా తక్కువ టైమ్​లో దీనిని రెడీ చేసుకోవచ్చు. అదే మలై టోస్ట్. దీనిని మలై క్రీంతో పాటు చక్కెరతో కలిపి చేస్తారు కాబట్టి ఇది గొప్ప రుచిని అందిస్తుంది. ఈ క్రిస్పీ టోస్ట్ ఒక కప్పు వేడి టీతో మరింత రుచిగా ఉంటుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మలై - 3 టేబుల్ స్పూన్లు

* చక్కెర - 1 టేబుల్ స్పూన్

* బ్రెడ్ - 2

మలై టోస్ట్ తయారీ విధానం

ముందుగా టోస్టర్​లో బ్రెడ్ స్లైస్‌లను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు టోస్ట్ చేయండి. అవి ఫ్రై అయ్యాయని నిర్ధారించాక.. దానిపై మలై క్రీమ్‌ను వేయండి. దానిపై పంచదార వేస్తే సరి. మీ బ్రేక్​ఫాస్ట్ రెడీ. దీనిని ఒక కప్పు వేడి టీతో తీసుకుంటే.. హాయిగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం