తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thursday Motivation On Stay Strong And Make Them Wonder How You're Still Smiling

Thursday Motivation : మరి అంతగా.. మహా చింతగా మొహం ముడుచుకోకలా.. హ్యాపీగా నవ్వండి

29 September 2022, 6:28 IST

    • Thursday Motivation : మీ శత్రువులు మీకు కష్టాలు రావాలని కోరుకుంటున్నారు అనుకో.. వారి ముందే మీరు నవ్వుతూ తిరగండి. అప్పుడు వాళ్లు భయపడతారు. వీడేంటి మరి ఇంత స్ట్రాంగ్​గా ఉన్నాడు. ఏమి చూసుకుని నవ్వుతున్నాడు అంటూ తలలు పట్టుకుంటారు. ఒకరు ఏడిపిస్తే ఆగిపోయే వాళ్లం మనం కాదు అని వారికి మీ నవ్వుతో సమాధానం ఇవ్వండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : మీకు ఎన్ని కష్టాలు ఉన్నా.. మీరు నవ్వుతూ ఉంటే మంచిది. ఎందుకంటే నవ్వినప్పుడు మీరు లోపల నుంచి సానుకూలంగా ఉంటారు. అది మీకు పాజిటివ్ వైబ్ ఇస్తుంది. అలాగే మీ చుట్టూ, మీకు కష్టాలు రావాలి అనుకున్న వారి మదిలో అలజడి సృష్టిస్తుంది. లేదంటే మీరు మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Wedding Dress : పెళ్లి బట్టలు చాలా సంవత్సరాలు భద్రపరిచేందుకు కొన్ని సింపుల్ టిప్స్

Cool Places in AP: వేసవిలో విశాఖపట్నానికి వెళితే కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రదేశాలు ఇవే

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

జీవితంలో మీరు పూర్తిగా కష్టాల్లో చిక్కుకుపోయినా.. ఎటు వెళ్లినా నిరాశే ఎదురైనా.. గెలుపునకు చివర్లో ఆగిపోయినా.. మీ మొహం మీద నవ్వు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ నవ్వు మీరు మరోసారి ప్రయత్నించడానికి మీకు శక్తిని ఇస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకునేలా చేస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడేలా చేస్తుంది. ఎందుకంటే వీడు ఓడిపోయినా ఇంత స్ట్రాంగ్​గా ఎలా ఉన్నాడు. ఏమి చూసుకుని వీడు పొగరు అని ఆలోచిస్తారు. గట్టిగా చెప్పాలంటే వారు మీ సామర్థ్యాన్ని అంత సులువుగా అంచనా వేయలేరు.

మీరు ఇతరుల ముందు మీ ఎమోషన్స్​ని బహిర్గతం చేస్తూ.. మీరు బాధపడుతున్నారని వారు చూస్తే.. మీ ప్లస్, మైనస్​ ఏమిటో వారికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. పైగా వాళ్లు దానినుంచి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశముంది. రాబోయే రోజుల్లో వారు దానితో మిమ్మల్ని ఓడించాలని చూస్తారు. కాబట్టి మీ బాధ, కష్టాలను ఒక్క నవ్వుతో కప్పేయండి. అప్పుడు వాళ్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. మిమ్మల్ని ఏమాత్రం అంచనా వేయలేరు. మీరు తరువాత స్టెప్ ఏంటో తెలియక సతమతమవుతుంటారు.

లైఫ్​లో హెచ్చు తగ్గులు ఉంటాయని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అది మిమ్మల్ని విచారంగా ఉండనివ్వదు. కొందరు తాము ఓడిపోయినా పర్లేదు మీరు మాత్రం గెలవకూడదు అనుకుంటారు. మీరు ఓడిపోయి ఏడుస్తుంటే అది చూసి వారు సంతోషించాలి అనుకుంటారు. కానీ మీరు గెలిస్తే ఎలాగో సంతోషంగా ఉంటారు. కానీ మీ శత్రువులు గెలిచి.. మీరు ఓడిపోయినా.. నవ్వుతూ ఉన్నారనుకోండి. వారికి ఆ విజయం కూడా సంతోషాన్ని ఇవ్వదు. అరె ఓడిపోయినా వీడు సంతోషంగా ఎలా ఉన్నాడని బుర్ర బద్ధలైపోయేలా ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ నవ్వతూ ఉండండి. మీ చిరునవ్వు మీరు లోపల నుంచి బలంగా ఉన్నారని చూపిస్తుంది. వ్యక్తుల అభిప్రాయాలను తారుమారు చేస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అబ్బో ఇలాంటివి చాలా చూశాం అనుకుంటూ.. ఓ నవ్వు నవ్వేయండి.