Wednesday Motivation : ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారికి బాధలు లేవనుకోవడం మూర్ఖత్వమే..-wednesday motivational story on walk gently in the lives of others ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారికి బాధలు లేవనుకోవడం మూర్ఖత్వమే..

Wednesday Motivation : ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారికి బాధలు లేవనుకోవడం మూర్ఖత్వమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 07, 2022 07:09 AM IST

Wednesday Motivation : ఓ వ్యక్తిని చూస్తే పాజిటివ్​గా అనిపించవచ్చు. వారితో మాట్లాడుతుంటే.. వారికేం సమస్యలు లేవని అనిపించవచ్చు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా, నవ్వుతూ మీకు కనిపించవచ్చు. కానీ దాని అర్థం వారికి బాధలు లేవని కాదు. వారు తమ సమస్యలు ఇతరులకు పంచుకునే స్వభావం లేనివారని అర్థం. అలాంటి వారిపట్ల సున్నితంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే..

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : మన జీవితంలో చాలా మంది వ్యక్తులను కలుస్తాము. కానీ కొందరు ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ.. ఎదుటివారిని నవ్విస్తూ కనిపిస్తారు. దాని అర్థం వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదొక తెలియని వెలితి ఉంటుంది. అది వారిని ఎల్లప్పుడూ వెంటాడుతున్నా.. పైకి దాని ఛాయలు చూపించకుండా నవ్వుతూ కాలం గడిపేస్తారు.

అలాంటి వారు తమ సమస్యలను ఎదుటి వ్యక్తి చెప్పడానికి ఇబ్బంది పడతారు. కొందరు తమ కష్టాల గురించి ఇతరులతో మాట్లాడేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఉన్న కష్టాల గురించి మాట్లాడుకుని.. ఇప్పుడున్న సమయాన్ని కూడా పాడుచేసుకోవాలా? ఇప్పుడైనా హ్యాపీగా ఉందామనుకుంటారు. అలాంటి భావాలు ఉన్నవారు అంతర్ముఖంగా ఉంటారు. అందుకే ఇతరుల ముందు తమ బాధలు గురించి చెప్పడానికి ఇష్టపడరు. తమకు బాధలున్నాయని తెలిసేలా చేయరు.

అలాంటి వ్యక్తులు మీ జీవింతలో ఉంటే వారిపట్ల సున్నితంగా వ్యవహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని గాయాలు పైకి కనిపించవు. కొన్ని దెబ్బలు లేదా మానసిక గాయాలు మనిషిని నిలువునా ముంచేస్తున్నా.. పైకి మాత్రం ఏమి కనిపించవు. అందుకే ఆ వ్యక్తి దేని గురించి బాధపడుతున్నాడో తెలియడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి వారి జీవితంలో మనం ఉన్నప్పుడు మనం సున్నితంగా, మర్యాదగా ఉండటం చాలా అవసరం. మన చేసే ఏ చర్య వారిని బాధపెడుతుందో మనకి తెలియదు కాబట్టి.. వారితో కాస్త జాగ్రత్తగా మెసులుకుంటే మంచిది. వారి దృక్కోణం నుంచి పరిస్థితి విశ్లేషించడానికి ప్రయత్నించాలి.

అందరూ ఒకేలా ఉండరు. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అందరూ ఒకటే కావాలనుకుంటారు. అది వారికిచ్చేస్తే సరిపోతుంది అనుకుని భ్రమపడతారు. కానీ ప్రతి వ్యక్తి.. డిఫరెంట్ కోరికలతో ఉంటారు. ఒకరు అర్థం అయ్యారని.. మరొకరు అలాగే ఉంటారనుకోవడం నిజంగా మీ భ్రమే అవుతుంది. అందువల్ల మీరు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. మీరు వారి బాధ నుంచి బయటకు లాగకపోగా.. ఎక్కువ ఒత్తిడికి గురి చేసే అవకాశముంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం