Thursday Quote : ప్రేమించిన వాళ్లు పక్కన లేకుంటే.. ప్రపంచం నీతో ఉన్నా వెలితిగానే ఉంటుంది..
Thursday Quote : బాగా డబ్బున్న వాడినో లేదా.. అన్ని సౌకర్యాలు ఉన్నవాడినో చూసి.. వీడికేందిరా అన్ని బాగానే ఉన్నాయి. కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు అని చాలామంది అనుకుంటారు. కొందరు అలానే ఉంటారు కూడా. కానీ కొందరు అన్ని సౌకర్యాలు ఉన్నా.. రాజభోగాలు అనుభవిస్తున్నా.. వాళ్లకి అవేమి సంతృప్తినివ్వవు. ఎందుకంటే..
Thursday Motivation : కొందరు అన్ని సౌకర్యాలు కలిగి ఉండొచ్చు. మొత్తం ప్రపంచాన్నే శాసించగలిగే డబ్బు ఉండొచ్చు. కానీ వాళ్లకి కావాల్సిన ప్రేమ వారి దగ్గర లేకపోవచ్చు. ఎంత డబ్బు సంపాదించినా.. ఎన్ని బంగ్లాలు కట్టినా.. నా అనే వాళ్లు పక్కన లేకపోతే అవేమి కిక్ ఇవ్వవు. ఎందుకంటే ఆ హృదయం ఇప్పటికీ వాళ్లకి కావాల్సిన వారినే కోరుకుంటుంది. వారి ప్రేమ గురించే ఎదురుచూస్తుంది కాబట్టి.
ఉదాహరణకు రతన్ టాటానే తీసుకోండి. ప్రపంచంలో ఏది కావాలన్నా దక్కించుకోగలిగే సత్తా ఆయనకుంది. కానీ ఆయన మాత్రం తన ప్రేయసి దగ్గరే తన ప్రేమ జీవితాన్ని ఆపేశారు. ఎన్ని కోట్లున్నా.. ఒంటరితనంలోనే బతుకును సాగిస్తున్నారు. ఒంటరిగా సమయం గడిపితేనే కానీ తెలియదు.. ఒంటరితనం ఎలా ఉంటుందోనని.. అని ఆయనే ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అంటే ఆయన ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో మీరే అర్థం చేసుకోండి.
అలాగే చాలామంది చూడటానికి పైకి వాళ్లకేమి లోటు. వారి జీవితం చాలా బాగుంటుంది. వాళ్లు హ్యాపీగానే ఉంటారు. వాళ్లకేమి సమస్యలుండవు అనుకోకండి. ఎలాంటి వారికైనా సమస్యలు ఉంటాయి. రాజుకుండేవి రాజుకు ఉంటే.. పాలేరుకుండేవి పాలేరుకుంటాయి. అంతే కానీ వీడికి డబ్బుంది ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. వీడికి లేవు కాబట్టి అన్ని సమస్యలే ఉంటాయనుకోకూడదు. డబ్బులేని వాళ్లు సంతృప్తిగా.. ఉన్నదానిలో హ్యాపీగా గడిపేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాగే డబ్బుండి కూడా కావాల్సిన ప్రేమను కొనుక్కోలేని వాళ్లు కూడా చాలామందే ఉంటారు.
డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం కానీ.. మనిషిని కొనగలరు కానీ ప్రేమను కొనలేరు లేదు. ఒక్కోసారి ఇతరులు ఇచ్చే ప్రేమకంటే.. మనం కోరుకున్న ప్రేమ మనకు దక్కితేనే ఆనందంగా ఉండగలం. అలాంటి ప్రేమ దక్కకుంటే.. ఒంటరితనంలో కూరుకుపోతాము. కాబట్టి ఎవరినైనా లుక్స్ చూసో.. లేదా ఫోటోలు, వాళ్లు తిరిగే కార్లు ఇలాంటివి చూసి ఈజీగా జడ్జ్ చేయడం మానేయండి. ప్రపంచంలో ప్రతి ఒక్కనికి ఏదో ఒక వెలితి ఉంటుంది. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి.
సంబంధిత కథనం
టాపిక్