తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On Whatever You Do, Do With Determination. You Have One Life To Live.

Wednesday Motivation : మీరు ఏ పని చేసినా.. మీ బెస్ట్ ఇవ్వండి.. అదే మిమ్మల్ని సక్సెస్ చేస్తుంది..

28 September 2022, 6:27 IST

    • Wednesday Motivation : లైఫ్​లో మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. ఉన్నది ఒక్కటే జీవితం. దానిలో మీకు నచ్చే విషయాల్లో సర్దుకుపోకండి. కానీ ఏ పని చేసినా.. శ్రద్ధతో.. పూర్తి ఎఫర్ట్స్ పెట్టి.. మీ బెస్ట్ ఇవ్వండి. చేసే ప్రతి పనిని మీ మార్క్ కనపడేలా చేయండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : విజయానికి ఏకైక రహస్యం సంకల్పం. మన సంకల్పం గొప్పదైతే.. కచ్చితంగా అది మనల్ని తిరిగి చేరుతుంది. ముందు మనం ఏమి చేయగలమో గుర్తించాలి. అది మనం చేయగలమని.. ఆ సత్తా మనలో ఉందని నమ్మితే చాలు.. కచ్చితంగా మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు. కానీ మీ నమ్మకం మాత్రమే విజయాన్ని చేరువ చేయదు. మీ కష్టం కూడా ఉండాలి. మీ చేసే పనిని శ్రద్ధగా, ఎఫర్ట్స్ పెడుతూ.. అనుకున్న పనిని పూర్తి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు

Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

ఇవన్నీ సంకల్పం ఉంటే జరుగుతాయి. ఎందుకంటే పనిపై దృష్టి పెట్టడంలో.. మీరు స్థిరంగా ఉండటంలో.. మీరు గమ్యానికి ఎలా వెళ్లాలనుకుంటున్నారో ఇవి మీ సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. మీరు మీ పనిపై, అనుకున్న దానిపై గట్టిగా నిలబడకపోతే.. మీరు ఆ పనిపై శ్రద్ధ వహించలేరు. పైగా మీరు చేసేది మీకు నచ్చిన పని అనుకో.. ఇంకా సూపర్. ఉన్నది ఒక్కటే జీవితం. దీనిలో మీ మనసుకు నచ్చినదానిని సాధించడానికి వెనకడుగు వేయకండి.

రాజీపడటం జీవితం కాదు. ఎందుకంటే ఈ వయసు, ఈ అవకాశాలు, ఈరోజు మళ్లీ మళ్లీ రావు. అవి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలి. రాజీపడుతూ కూర్చుంటే రెండో జీవితం వస్తుందా ఏమిటి? రాదు కదా. కాబట్టి ఏది సాధించాలనుకున్నా.. మీ కలలను తీర్చుకోవాలి అనుకున్నా.. ఇదొక్కటే జీవితం. ఏదైనా సాధించడం కోసం మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తాయేమో. కానీ.. జీవితం మాత్రం ఒక్కటే. అదిపోతే మళ్లీ రాదు.

మీరు ఏది కావాలనుకుంటే అదే అవ్వండి. మీ కష్టం, మీ శ్రమ ఎప్పటికీ వృథా కాదు. ఏదొకరూపంలో ఎప్పుడో ఒకప్పుడు మీకు మంచి అవకాశం ఇస్తుంది. అలా అవకాశాలు రావాలంటే మీరు చేసే పనిలో మీరు బెస్ట్ ఇవ్వండి. ఒకవేళ అవకాశం రాకపోయినా.. మీరు మీ బెస్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటారు.

చాలా మంది ఏవేవో అవ్వాలని కలలు కంటారు. కానీ వాటిని నెరవేర్చుకునేందుకు ఏమి చేయరు. అదేమి అంటే అవకాశం రావట్లేదు ఎలా చేయాలి అంటారు. అసలు ముందు అవకాశాలు రావాలంటే ఏదైనా చేయాలిగా. ఎంతో కొంత ప్రయత్నించాలి. తమని తాము మెరుగుపరచుకోవాలి. అలాంటప్పుడే అవకాశాలు వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ పనిని బెస్ట్​గా చేస్తే.. కచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది.