Friday Quote : వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం..
ప్రతి ఉదయం ఏదొక మంచి ఆలోచనతో రోజును ప్రారంభిస్తే.. అది మీకు రోజంతా పాజిటివ్ వైబ్నే ఇస్తుంది. మీ సమస్యలను పోరాడ ధైర్యం ఇస్తుంది.
Friday Motivation : మనకి ప్రేరణ ఎక్కడి నుండైనా రావచ్చు. ఓ దృశ్యం చూసినా లేదా ఓ వ్యక్తితో మాట్లాడినా.. ప్రేరణ కలిగించే వీడియోలు చూసినా.. మనం వాటినుంచి స్ఫూర్తిని పొందవచ్చు. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే.. దానికి కావాల్సిన శక్తిని పొందడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆ శక్తి మీకు సానుకూలంగా ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు
ఈ నేపథ్యంలో మీరు ప్రతి ఉదయం మీలోని ఆ సానుకూలతను వెలికితీసే ఏదో ఒక పని చేయాలి. సానుకూలత అనేది ఓ రోజు మొత్తం మిమ్మల్ని ప్రోత్సాహిస్తుంది. మీ మార్గంలో ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కోనేలా సహాయం చేస్తుంది. వాటికి ఎదురుగా నిలిచి పోరాడే ధైర్యం ఇస్తుంది. ఇది అంత సులభంగా వచ్చేది కాదు. కానీ రోజూ దీనిని అలవాటు చేసుకుంటే మాత్రం ఆ మార్పులు మీరే చూడవచ్చు.
సానుకూల మార్గంలో ఆలోచించడానికి మీ మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి సమయం పడుతుంది. ఎన్ని రోజులైనా ఓపికగా ఆ పని చేస్తే.. ఆ వ్యక్తి యుద్ధంలో సగం విజయం సాధిస్తాడు. మనసులో భయంతో నువ్వు ఎప్పుడూ సంతోషంగా జీవించలేవు. నిబద్ధత, సహనం అనేవి రెండు ముఖ్యమైన విషయాలు. ప్రతికూల ఆలోచనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని భయపెడతాయి. కాబట్టి సానుకూలంగా మాట్లాడాలి. సానుకూలంగా ఆలోచించాలి. దీనిలో భాగంగా సానుకూల కథనాలను వివరించే పుస్తకాలు, మ్యాగజైన్‌లను చదవండి. ఇవి మీకు కాస్త సహకరిస్తాయి. మంచి షోలు చూడటం, సానుకూలమైన వ్యక్తులతో కలిసి తిరగడం వల్ల మీలో మార్పు మొదలవుతుంది. మీ సాధించే విజయాలు చాలా వరకు మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. మీరు సానుకూలంగా ఆలోచించినప్పుడు.. మీరు మరిన్ని అవకాశాలను ఆకర్షిస్తుంది.
సంబంధిత కథనం