తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : నవ్వు నలభై విధాలుగా మంచిదే.. కాబట్టి నవ్వండి..

Saturday Motivation : నవ్వు నలభై విధాలుగా మంచిదే.. కాబట్టి నవ్వండి..

24 September 2022, 6:20 IST

    • Saturday Motivation : జీవితమనేది చిన్నది. దానిని హ్యాపీగా నవ్వుతూ గడిపేయండి. అంతేకానీ టెన్షన్లు, బాధలు, కష్టాలు అంటూ.. ఉన్న కొంచెం స్పేస్​ని చెడగొట్టుకోవడం ఎందుకు. మనం హ్యాపీగా ఉండటానికి అర్హులం. అలాంటి హ్యాపీనెస్​ని ఎవరో ఇస్తేనే వస్తుంది అనుకోకండి. మీరు హ్యాపీగా ఉండటానికి పూర్తిగా అర్హులని మాత్రం గుర్తించుకోండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : ఉన్నది ఒకటే లైఫ్ అబ్బా. దానిలో కష్టాలు, కన్నీళ్లు, గొడవలు.. ఇలా చెప్పుకుంటే పోతే.. చాలా ఎమోషన్స్ అనేవి కామన్. కానీ ఉన్న కొద్ది స్పేస్​ని ఆ కష్టాలు, కన్నీళ్లు గురించి ఆలోచించుకోవడమేనా? ఇదెక్కడి న్యాయం. కాస్త నవ్వుకోండి. వాటి గురించి ఆలోచించి.. మీకున్న కొద్ది సమయాన్ని దూరం చేసుకోకండి. మంచిగా హ్యాపీగా ఉండేందుకు.. నవ్వుతూ బతికేందుకు ప్రయత్నించండి.

నవ్వడానికి నలుగురు లేకుంటే ఎలా?

అవును నవ్వడానికి, హ్యాపీగా ఉండటానికి మనతో కొందరు ఉండాలి. కనీసం జీవితంలో ఒక్క వ్యక్తి అయినా చాలు మనల్ని హ్యాపీగా ఉంచుతారు. అలాంటి వారితో సమయం ఎక్కువ గడపండి. అలాంటి వ్యక్తి మీ లైఫ్​లో లేకపోతే.. సెల్ఫ్ ఎంటర్​టైన్ అవ్వండి. మనల్ని ఎవరో ఏదో చేయనవసరం లేదు. మనం హ్యాపీగా ఉండటానికి అర్హులం. ఏ ఒక్కరి వల్ల ఆ సంతోషాన్ని, హ్యాపీనెస్​ని దూరం చేసుకోవద్దు. ఆ సమయంలో మీ నచ్చిన పని చేయండి. సినిమాలు, స్టాండ్ అప్ కామెడీలు, బయటకు వెళ్లడం, పరిచయం లేని వారితో సంభాషించడం ఇలా చెప్పుకుంటూ పోతే.. మీ మనసుకు నచ్చిన పని ఏది చేసినా.. మీరు హ్యాపీగానే ఉంటారు.

ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉండటానికి ఎవరి పర్మెషన్ అవసరం లేదు. మీరు దానికి అర్హులు. దానికి ఎవరి సమ్మతో అవసరం లేదు. జీవితం అద్భుతమైనదని అర్థం చేసుకోవడం ముఖ్యం. దానిలో కొన్ని మనకు వ్యతిరేకంగా జరుగుతున్నా.. వాటిని అర్థం చేసుకుని.. ఓ నవ్వుతో ముందుకు సాగాలి అంతే. ప్రతిఒక్కరూ హ్యపీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. దానికోసమే కష్టపడతారు. ఈ ప్రాసెస్​లో వారు హ్యాపీగా ఉండడం మానేసి.. కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడూ పోతామో తెలియని ఈ జీవితంలో ఇంకెప్పుడు వారు హ్యాపీగా ఉంటారు. ఉన్న అవకాశాలను వదిలేసి.. ఏమి సాధించాలని ఆశ పడినా వేస్టే కదా.

కొన్ని సమయాల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మీరు చిరునవ్వుతో సానుకూల విషయాలపై దృష్టి పెట్టినప్పుడే జీవితం మెరుగుపడుతుంది. నవ్వుతూ.. సంతోషంగా ఉండటానికి చాలా కారణాలు మన చుట్టూ ఉంటాయి. వాటిని కనిపెట్టి.. బాధలను సైడ్​కి జరిపి.. ముందుకు సాగడమే జీవితం. అంతా అయిపోయాకా.. నేను ఎప్పుడూ సంతోషంగా లేనే అని బాధపడటం కన్నా.. ఇప్పటినుంచైనా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు నవ్వుతూ.. హ్యపీగా ఉన్నప్పుడు.. మీరు ఆనందం పొందడమే కాకుండా.. ఎదుటి వ్యక్తులకు ఓ పాజిటివ్ వైబ్​ ఇస్తుంది.

టాపిక్