తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Carrot Rice : కొత్త పద్ధతిలో బీట్‌రూట్, క్యారెట్ రైస్ తయారీ విధానం

Beetroot Carrot Rice : కొత్త పద్ధతిలో బీట్‌రూట్, క్యారెట్ రైస్ తయారీ విధానం

Anand Sai HT Telugu

06 May 2024, 11:00 IST

google News
    • Beetroot Carrot Rice Recipe : ఆరోగ్యకరమైన భోజనం చేయడం మెుత్తం శ్రేయస్సుకు మంచిది. అందులో భాగంగా బీట్‌రూట్, క్యారెట్ రైస్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది.
బీట్ రూట్, క్యారెట్ రైస్
బీట్ రూట్, క్యారెట్ రైస్

బీట్ రూట్, క్యారెట్ రైస్

కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం తయారు చేసేందుకు సమయం ఉండదు. ఏదైనా త్వరగా చేసుకుని తినాలని అనుకుంటాం. కానీ ఏం చేయాలో అర్థంకాదు. అలాంటివారు బీట్ రూట్ క్యారెట్ రైస్ చేయండి. ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. చిన్నలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడానికి సమయం కూడా పెద్దగా పట్టదు. ఎలా చేయాలో తెలుసుకుందాం..

మీరు త్వరగా భోజనం తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే భోజనం చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఈ వేసవిలో మరింత కష్టం. ప్రతిరోజూ వివిధ రకాలుగా మధ్యాహ్న భోజనం చేయడం ఒక సవాలుగా ఉంటుంది.

అయితే బియ్యాన్ని ఉపయోగించి చేసే పులిహోర, పలావ్, రైస్‌బాత్ లాంటివి మాత్రమే కాదు.. మీరు బీట్‌రూట్, క్యారెట్ రైస్ ప్రయత్నించారా? మీరు క్యారెట్, బీట్‌రూట్‌లతో రుచికరమైన అన్నం చేయవచ్చు. ప్రతి ఒక్కరూ దీని రుచిని ఆస్వాదిస్తారు. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో తయారు చేయవచ్చు. ఇంతకీ ఈ బీట్‌రూట్-క్యారెట్ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి? దీన్ని చేయడానికి సరైన మార్గం ఏంటి? మెుత్తం సమాచారం తెలుసుకోండి.

బీట్‌రూట్, క్యారెట్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

బీట్‌రూట్ 2, క్యారెట్ 2, పచ్చిమిర్చి - 2, ఎర్ర మిర్చి - 2, వెల్లుల్లి-1, ఉల్లిపాయ-1, ఆవాలు - 1/4 tsp, జీలకర్ర - 1/2 tsp, శనిగలు - 1 టేబుల్ స్పూన్, వేరుశెనగ - 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 2 చిటికెలు, ఉప్పు సరిపోయేంత, జీలకర్ర పొడి - 1/4 tsp, నల్ల మిరియాల పొడి - 1/4 tsp, కరివేపాకు - 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర - 1 కట్ట, వంట నునె సరిపడేంత.

బీట్‌రూట్, క్యారెట్ రైస్ తయారీ విధానం

ముందుగా స్టౌ మీద పాత్ర పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో నెయ్యి వెయ్యాలి.

అదే నూనెలో శెనగలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనికి ఉల్లిపాయలు వేసుకోవాలి.

1 నిమిషం వేగిన తర్వాత తురిమిన బీట్‌రూట్, క్యారెట్ వేసి కలపాలి. దానికి ఉప్పు వేసి 3 నిమిషాలు ఉడికించాలి.

ఉడికిన తర్వాత కారం పొడి, ఎండుమిర్చి పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.

తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి కలపాలి. మిక్సింగ్ చేసేటప్పుడు మంట తక్కువగా ఉంచండి.

అన్నం బాగా మిక్స్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. బీట్‌రూట్-క్యారెట్ రైస్ మీ ముందు సిద్ధంగా ఉంది.

ఇది ఉదయం అల్పాహారం లేదా లంచ్ బాక్స్‌లో ఆనందించవచ్చు. నేరుగా దీనిని తినవచ్చు. లేదంటే ఏదైనా కలపవచ్చు. బఠానీ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఈ రెసిపీ తయారీ చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు.

తదుపరి వ్యాసం