పచ్చి క్యారెట్లు రోజూ తింటే చర్మం రంగు మారుతుందా?

pixabay

By Haritha Chappa
Apr 25, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో క్యారెట్లు ఒకటి. పచ్చి క్యారెట్లు అధికంగా తింటే చర్మం రంగు మారుతుందనే అభిప్రాయం ఉంది. 

pixabay

 క్యారెట్లు పచ్చిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు వీటిని తినిపిస్తే ఎంతో మంచిది. 

pixabay

క్యారెట్లలో బీటాకెరాటిన్ అధికంగా ఉంటుంది. దాని వల్లే అవి ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఇదొక కలర్ పిగ్మెంట్.

pixabay

రోజుకు ఒకట్రెండు క్యారెట్లు తినడం వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ అంతకు మించి తింటే చర్మం రంగు మారే అవకాశం ఉంది.

pixabay

క్యారెట్ల ద్వారా బీటాకెరాటిన్ శరీరంలో చేరి విటమిన్ ఎ గా మారుతుంది. 

pixabay

 సరిపడినంత విటమిన్ ఎ మారి, మిగతాది రక్తంలో చేరిపోతుంది. దీని వల్ల చర్మం రంగు మారుతుంది. కాస్త పసుపు రంగులోకి మారుతుంది. 

pixabay

 ఇలా క్యారెట్ల వల్ల చర్మం రంగు మారితే ఆ సమస్యను కెరోటినేమియా అంటారు. ఇది మంచిది కాదు. 

pixabay

వేరుశనగలతో బరువు తగ్గింపు...! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash