తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: ఒకరి నమ్మకాన్ని బ్రేక్ చేశాాకా.. మీరు సారీ చెప్పినా నో యూజ్

Saturday Motivation: ఒకరి నమ్మకాన్ని బ్రేక్ చేశాాకా.. మీరు సారీ చెప్పినా నో యూజ్

03 September 2022, 7:30 IST

    • Saturday Motivation : లైఫ్​లో ఏదొక సమయంలో ఓ స్టేజ్​కి చేరుకుంటాం. అప్పుడు మనం ఎవరిని నమ్మలేము. కానీ ఆ సమయంలో ఓ వ్యక్తిని మనం ఎక్కువగా నమ్మినప్పుడు.. ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని బ్రేక్​ చేస్తే మీకు ఎలా ఉంటుంది. ఆ బాధను మీరు కంట్రోల్ చేసుకోలేరు. కనీసం వారు చెప్పే సారీని కూడా యాక్సెప్ట్ చేయలేరు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : ఓ వ్యక్తి మీద నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు.. క్షమించండి అనే పదం మీలో ఎలాంటి తేడాను తీసుకురాదు. ఇది నిజం. ఎందుకంటే.. చాలా మంది మీ ట్రస్ట్ లేదా నమ్మకాన్ని బ్రేక్ చేసి ఉండొచ్చు. కానీ ఓ వ్యక్తిపై.. మీరు నా అనుకున్న వ్యక్తిపై పెట్టుకున్న నమ్మకం బ్రేక్​ అయినప్పుడు.. వారు చెప్పే సారీ నథింగ్. ఓ మనిషి మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయాకా.. సారీ చెప్పి ఏం లాభం. నమ్మకం తిరిగి వస్తుందా?

‘When Trust is Broken, Sorry Means Nothing.'

ఓ వ్యక్తికి మీపై నమ్మకం కలగడానికి చాలా టైం పట్టి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కూడా పట్టి ఉండొచ్చు. కానీ దానిని బ్రేక్ చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. నిజమే.. మీరు ఎంత కష్టపడి నమ్మకాన్ని సంపాదించినా.. దానిని బ్రేక్ చేయడానికి ఒక్క క్షణం కంటే తక్కువ సమయం చాలు.

నమ్మకం పొందడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఏదో అనుకోకుండా జరిగినదానికి ఇంత ఫీల్ అవ్వాలా.. అనుకుంటే అది కరెక్ట్ కాదు. ముందు ఎలా ఉండేదో ఆలోచించు.. ఇప్పుడేదో జరిగిందని దూరం చేసుకోవాలా అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే ఒకరి మనసు విరిగిపోయేలా ప్రవర్తించి.. మీరు తర్వాత ఎన్ని సారీలు చెప్పినా నథింగే. ఆ మనిషి మిమ్మల్ని నమ్మడానికి ఎక్కువ సమయం తీసుకున్నారంటేనే ఆలోచించాలి. వాళ్లు నమ్మడానికి ఎంత ఆలోచిస్తున్నారో. ఎందుకంటే.. వారి నమ్మకాన్ని ఎంతోమంది ఇప్పటికే బ్రేక్ చేసి ఉంటారు. అందుకే వారికి మిమ్మల్ని కూడా నమ్మడానికి అంత సమయం పట్టింది. కానీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్కసారిగా బ్రేక్ చేసి.. ఇప్పుడు సారీ చెప్తే అంతా సెట్ అయిపోతుందా?

మీరు ఇప్పుడు సారీ చెప్పడం కాదు. వారి నమ్మకాన్ని బ్రేక్ చేసే ముందే ఆలోచించుకోవాల్సింది. ఇలా అంటే వాళ్లు ఏమి ఫీల్ అవుతారు. ఇలా చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీరు ముందే ఆలోచించుకోవాల్సింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం చెప్పండి. మీరు చెప్పే సారీ వారిని మీకు దగ్గర చేస్తుందా అంటే చెప్పలేము. లేదా అంతకుముందు ఉన్నంత నమ్మకాన్ని మీపై చూపిస్తుందా అంటే కూడా డౌటే. ఏదో సారీని బలవంతంగా యాక్సెప్ట్ చేసి మీతో ఉన్నా.. వాళ్లకి మొదట్లో మీపై ఉన్నంత నమ్మకం ఇప్పుడు ఉండదు.

నమ్మకం అనేది అద్దం లాంటిది. మీరు దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కసారి అద్దం కింద పడి పగిలిపోతే.. ఎంత ప్రయత్నించినా గాజు మీద గీతలు అలాగే ఉంటాయి. అందువల్ల దాన్ని పగులగొట్టడానికి ముందే ఆలోచించాలి. మీరు వారి హృదయాన్ని ఛిద్రం చేసిన క్షణాన్ని వాళ్లు ఎప్పటికీ మరచిపోరు. కాబట్టి మీరు ఎన్నిసార్లు “క్షమించండి” అని అడిగినా పెద్ద ప్రయోజనం ఉండదు. దానిని సరిదిద్దడానికి ఎన్నిప్రయత్నాలు చేసినా.. విరిగిన ముక్కలు కలవడం సాధ్యం కాదు. ఒకవేళ కలిసినా.. అది ముందులా మాత్రం ఉండదు.