తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : ఎవరైనా జడ్జ్ చేస్తున్నారా? హకూనా మటాటా అనుకోండి..

Friday Motivation : ఎవరైనా జడ్జ్ చేస్తున్నారా? హకూనా మటాటా అనుకోండి..

02 September 2022, 7:11 IST

    • Friday Motivation : నువ్వు ఎంత మంచిగా ఉన్నా.. ఎంత మంచిగా బతికినా.. ఎంత గొప్ప పనులు చేస్తున్నా.. జనాలు ఎప్పుడు నిన్ను జడ్జ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఏ పని చేసినా ఇతరుల కోసం కాకుండా.. నీ సంతోషం కోసమే చేయి. అదే నీకు మంచిది. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : సమాజం ఉన్నదే అందుకు. ఎవరు ఏమి చేస్తున్నారు. వీళ్లు మంచి ఎందుకు చేస్తున్నారు. వీడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. అసలు వీళ్లు మంచిగా ఉన్నారా? నటిస్తున్నారా? అనే ఆలోచనలతో ప్రజలు సతమతమవుతూ ఉంటారు. నువ్వు ఎంత గొప్పగా బతికినా.. వారిని ఎంత మంచిగా చూసినా.. చివరికి వాళ్లు నిన్ను జడ్జ్ చేస్తారు. అది బయటవారే కావొచ్చు. కుటుంబ సభ్యులే కావొచ్చు. వాళ్లు కచ్చితంగా నిన్ను జడ్జ్ చేసే తీరుతారు. ఎవరైనా నిన్ను జడ్జ్ చేయట్లేదు అంటే దాని అర్థం వాళ్లకి నీతో పని ఉందని. లేదా వారు కూడా మంచి వాళ్లే అయి ఉండొచ్చు.

నీ సొంత డబ్బులు ఖర్చుపెట్టి.. ఇతరులకు సహాయం చేస్తున్నా.. నిన్ను జడ్జ్ చేసేవాళ్లు ఉంటారు. ఇంట్లో వాళ్లు సంపాదించిన డబ్బుతో వీడు దానధర్మాలు చేస్తూ.. బిల్డప్ ఇస్తున్నారు అనొచ్చు. నువ్వే కష్టపడి సంపాదించినా సరే వాళ్లు నమ్మరు. నీ కష్టాన్ని చూసినా సరే.. వారు నిన్ను నమ్ముతారని గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడైనా ఎదుటివారి మెప్పు కోసం ప్రయత్నించండి. మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అవి చేయండి. లైఫ్​లో హ్యాపీగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ.. మీరు హ్యాపీగా ఉన్నా సరే కొందరు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మీరు హ్యాపీగా ఉండాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని మీ లైఫ్​నుంచి తీసేయండి. విన్నా సరే వాటిని ఇగ్నోర్ చేయండి.

మీకు ఇతరులకు సహాయం చేస్తేనే మంచిగా, హ్యాపీగా ఉంటుందా? అయితే అదే ఫాలో అయిపోండి. మీకు హ్యాపీనెస్​ ఇచ్చే దేనినైనా నిర్భయంగా చేయండి. జీవితంలో ఉండే ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్లిపోవాల్సిందే. వాళ్లు మీరు బాగు పడటానికి చెప్పే సలహాలను వినండి. అంతేకానీ మీ కష్టం గురించి, మీ స్ట్రగుల్​ గురించి ఆలోచించకుండా.. మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారంటే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

మీకు లైఫ్​లో ఏమి చేయాలి అనే దానిమీద క్లారిటీ ఉంటే.. మీరు ఎవరి గురించి ఆలోచించనవసరం లేదు. ఈ సెకన్ మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా.. బంధాలలో ఇరుక్కుపోయినా మీరు హ్యాపీగా ఉండలేరు. అందుకే ఇప్పుడున్న లైఫ్​ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ఇతరులకు, మీకు హాని జరగకుండా చేసే ఏ పని అయినా మంచిదే. వాటిని ఎవరో ఏదో అనుకుంటారని ఆపేయకండి.