తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Quote : మీ ప్రవర్తన మీదనే.. ఎదుటివారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది..

Friday Quote : మీ ప్రవర్తన మీదనే.. ఎదుటివారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది..

05 August 2022, 8:07 IST

    • Friday Motivation : కొందరు ఎలా ఉంటారంటే.. ఎదుటివారిని తమ ప్రవర్తనతో ఎంత కష్టపెడుతున్నారో కనీసం కాస్త కూడా ఐడియా ఉండదు. మనం వారికి తిరిగి అదే ప్రవర్తనను చూపిస్తే మాత్రం తట్టుకోలేరు. అప్ సెట్ అయిపోతారు. అందుకే ఎదుటివారితో ప్రవర్తించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : కొన్ని సమయాల్లో.. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మొరటుగా, అహంకారంతో ఉంటాము. మనల్ని ఇష్టపడే వారైతే చాలావరకు భరిస్తారు. ఇష్టం లేని వారు.. లేదా ఇష్టఉన్నా తమను కంట్రోల్ చేసుకోలేకపోయినా వాళ్లు.. మనకు తిరిగి ఆ మొరటుతనాన్ని, అహంకారాన్ని తిరిగి ఇస్తారు. అప్పుడు మనం చాలా బాధపడతాము. కానీ మనము కూడా అలాగే ప్రవర్తిస్తున్నామని తెలుసుకుంటాము.

ట్రెండింగ్ వార్తలు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

అందుకే ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బాధపడినట్లే.. వారు కూడా బాధపడుతున్నారని గుర్తించాలి. మీరు పై స్థాయిలో ఉంటే.. మీ కింద స్థాయి వారిపట్ల మొరటుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కానీ మనం వారిపట్ల ప్రేమ, జాలి, దయ వంటివి చూపించినా సరిపోతుంది. వారు మీ పనిని పూర్తి చేసేస్తారు. కొందరు మీ మంచితనాన్ని చులకనగా తీసుకుంటే.. వారి విషయంలో కాస్త కఠినంగా ఉండి పని చేయించుకోవచ్చు కానీ.. అహంకారంతో ప్రవర్తించకూడదు.

మనం తరచుగా మన చుట్టూ ఉన్న ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తాము. ఇది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. మనకన్నా తక్కువగా ఉన్నవారిని చూస్తే.. ఏదో తెలియని అహకారం వచ్చేస్తుంది. ఆ సమయంలో చాలా మాటలు అనేస్తాము. ఇది కరెక్ట్ కాదు. మనకన్నా ఒకరు తక్కువగా ఉన్నారంటే.. మీకన్నా ఎవరో ఎక్కువలోనే ఉన్నారని అర్థం. వారు మిమ్మల్ని తక్కువగా చూసిన క్షణం మీకు అర్థమవుతుంది. ఇన్నిరోజులు ఎంత కఠినంగా వ్యవహరించాలనా అని బాధపడతారు.

మీరు వారితో ప్రవర్తించిన విధంగానే.. వారి మీతో ప్రవర్తించే రోజు వస్తుందనే భయం మీలో ఉండాలి. ఎందుకంటే కాలం ఏదొక రోజు మీ తప్పు మీకు తెలిసేలా చేస్తుంది. ఎదుటివారికి ప్రేమ ఇస్తే.. ప్రేమే తిరిగివస్తుంది. ఒక్కోసారి ప్రేమ తిరిగిరాకపోయినా.. మీపట్ల మంచి అభిప్రాయన్ని క్రియేట్ చేసి.. గౌరవాన్ని ఇస్తుంది.

ఎదుటివారు మిమ్మల్ని అహంకారంతో చూస్తూ.. మొరటుగా ప్రవర్తించడం మీకు నచ్చకపోతే.. ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీవైపు ఎటువంటి తప్పులేదని నిర్ధారించుకున్నాక.. వారితో మాట్లాడండి. అప్పుడు మీరు వారిలో మార్పును చూసే అవకాశముంటుంది. మీరు గతంలో చేసిన దానికి ఫలితమే ఇది తెలిస్తే కనుక.. మీరు మోనంగా వాటిని భరించాల్సిందే. ఎందుకంటే మీకు కూడా ఆ బాధ ఏంటో తెలియాలి. అప్పుడే మీలో మార్పు మొదలవుతుంది. మరోసారి అలాంటి తప్పు చేయరు.

టాపిక్

తదుపరి వ్యాసం