Wednesday Motivation : ఎన్ని కష్టాలు పడితే.. మానసికంగా అంత స్ట్రాంగ్ అవుతారు..
03 August 2022, 7:16 IST
- జీవితంలో మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు. ఎవరికి కనిపించకుండా ఏడ్చిన సందర్భాలు ఉండొచ్చు. ఇప్పటికీ ఆ అగాథంలో మీరు మగ్గిపోతూ ఉండొచ్చు. కానీ ఓ రోజు.. మీరు మీ జీవితాన్ని వెనక్కితిరిగి చూసుకుంటే.. అవి మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్‌గా మార్చాయో తెలుస్తుంది. అవే మీరు సక్సెస్ అయ్యేలా చేశాయని తెలిస్తే.. మీరే ఆశ్చర్యపోతారు.
కోట్ ఆఫ్ ద డే
Wednesday Motivation : ప్రతి ఒక్కరికి కష్టాలు, కన్నీలు అనేవి చాలా కామన్. అవును మరి కామన్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఏదొక టైమ్‌లో.. ఏదైనా పరిస్థితుల్లో.. ఎవరో ఒక వ్యక్తి వల్ల మీరు బాధపడే ఉండొచ్చు. లేదా ఇంకా బాధపడుతూ ఉండొచ్చు. ఇవి మిమ్మల్ని మీకు తెలియకుండానే స్ట్రాంగ్‌గా మారుస్తాయి. ఎంతగా అంటే మీరు కనీసం దాని గురించి ఏ మాత్రం కలగని ఉండరు కూడా. ఓ రోజు దాని గురించి తెలుసుకుంటారు. నేను అప్పుడు ఎలా ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచిస్తారు. వాటికి జవాబు.. మీ కష్టాలే అనే విషయం మీకు అర్థం అవుతుంది.
మీ కష్టాలు, కన్నీల్లే మిమ్మల్ని స్ట్రాంగ్ మారుస్తాయి. ఎవరి మాటలైనా మిమ్మల్ని మోటీవేట్ చేస్తాయేమో కానీ.. మీకు మీరు రియలైజ్ అయితే.. మీరు సగం ప్రాబ్లమ్స్‌ని అధిగమించినట్లే. ఒకప్పుడు మీరు చాలా సున్నితమైన మనసుతో ఎదుటివారు మీకు బాధ కలిగిస్తున్నా.. మౌనంగా భరించేవారే అయి ఉండొచ్చు. కానీ కొన్ని రోజులకు మీలో ఓ తెగింపు వచ్చేస్తుంది. బాధని ఎంతగా నొక్కిపెట్టి ఉంచారో.. అంతే వేగంగా మీలోనుంచి ఓ తెగింపు వస్తుంది. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది.
మీ ధైర్యం మీరు ఏదైనా సాధించేలా కృషి సహాయం చేస్తుంది. మీ విషయంలో నలుగురికి సమాధానం చెప్పేలా చేస్తుంది. మీ లైఫ్‌పై మీకు క్లారిటీని ఇస్తుంది. ఒకప్పుడు మీరు అనుభవించిన బాధే.. మీకు వంద టన్నుల ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మీరు జీవితంలో సంతోషంగా ముందుకు సాగేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ ఇలా ఉంటారని కలలో కూడా అనుకోలేదు అనేంతగా మిమ్మల్ని మార్చేస్తుంది.
ఆ క్షణం, మిమ్మల్ని మీరు గుర్తించిన సమయం చాలా విలువైనది. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండొచ్చు. మీకు ఎవరి మద్ధతు ఉండకపోవచ్చు. మీరు ఇంత కఠినంగా వ్యవహరిస్తారని.. ఎదుటివారే కాదు.. మీరు కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ మీకు కావాల్సిన విషయాలపై.. ఇన్ని రోజులు అనుభవించిన పరిస్థితులపై మీరు కఠినంగానే వ్యవహరించాలి. అప్పుడే మీరు ఎంత స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలుస్తుంది. అది మిమ్మల్ని వారు జీవితంలో అందుకోలేనంత దూరం తీసుకెళ్తుంది. మీ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
టాపిక్