తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : ఎదుటివారిని కాదు.. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..

Wednesday Motivation : ఎదుటివారిని కాదు.. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..

27 July 2022, 7:20 IST

    • Wednesday Quote:ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేమించే అర్హత ఉంటుంది. అయితే ఎవరినైనా ప్రేమించే ముందు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి. మీ ప్రేమకు ఎవరైనా అర్హులు ఉన్నారంటే అది మీరే అయి ఉండాలి. తర్వాతే వేరే ఎవరైనా. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే.. మీకు ఏమి కావాలి అనే విషయంపై స్పష్టత ఉంటుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : జీవితంలో ఎవరిని ప్రేమించినా.. ప్రేమించకపోయినా.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు శ్రద్ధం చూపేలా చేస్తుంది. అవును ఎవరికోసమో కాదు.. మనకోసం మనం ఫిట్​గా ఉండాలని ఆలోచిస్తాము. అయితే మిమ్మల్ని మీరు అన్ని విషయాలలో మెరుగుపరచుకునే వ్యక్తిగా మీరు మారుతారు. అది చాలా ఇంపార్టెంట్.

రోజూ మీరు చేసే పనిని మెచ్చుకోండి. పడుకునే ముందు మీరు చేసిన తప్పులను వేలెత్తి చూపించుకోండి. రేపటి నుంచి ఎలా ఉండాలో ప్రణాళికలు వేసుకోండి. పనిలో మీ సొంత మార్క్​ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కలిగి ఉన్న ప్రతిదీ మీ కృషి వల్లే వచ్చిందని మీరు గుర్తిస్తారు. అప్పుడు ఎదుటివారు మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసినా.. మీరు గర్వంగా మీ గురించి వారికి బదులు చెప్పగలరు.

ఎవరినైనా ప్రేమిస్తే.. వారి గురించి మీరు మారిపోకండి. మీరు నచ్చే మీ దగ్గరకు వచ్చారంటే.. దగ్గరకు వచ్చాక మీరు ఎందుకు నచ్చరు. మిమ్మల్ని ప్రేమించే వారి కోసం మీరు మారుకుంటూ పోతే.. ఏదొకరోజు మీ మీద మీకే విరక్తి వచ్చేస్తుంది. అలా కాకుండా జాగ్రత్తపడండి. మీ విషయంలో స్టాండ్ తీసుకోండి. మీకు వారికోసం ఏదైనా విషయంలో మారాలి అనుకుంటే మారవచ్చు కానీ.. బలవంతగా మీ మీద రుద్దుతున్నప్పుడ కాస్త ఆలోచించుకోండి. అప్పుడు మీరు మీ దృష్టిలో దిగజారకుండా ఉంటారు.

మీరు ఎలా ఉన్నా.. మీ విషయంలో మీరు కాన్ఫిడెంట్​గా ఉండడం చాలా ముఖ్యం. చేసే పనిలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలా మంది తమ తప్పులను పదే పదే గుర్తు చేసుకుంటూ.. తమని తామే నిందించుకుంటూ ఉంటారు. అలాగే వారికి లేని వాటిగురించి బాధపడతారు. ముందు మిమ్మల్ని మీరు క్షమించుకుని.. ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తే.. మీకు కావాల్సినవన్నీ మీరే సంపాదించుకుంటారు.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా.. ఎదుటివారి దగ్గర ప్రేమను వెతుక్కోవడం సరికాదు. ఎవరినుంచో ప్రేమ లభించట్లేదని బాధపడే బదులు.. మిమ్మల్ని మీరు లవ్​ చేసుకుంటే మంచిది కదా. మహేశ్ బాబు చెప్పినట్లు మీకన్నా తోపు ఎవడు లేడు ఇక్కడ అనే కాన్ఫిడెంట్ ఉండాలి. మీ మీద మీకున్న ప్రేమ ఎప్పుడూ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది మీలో అహాన్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీ మీద మీకున్న ప్రేమ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

మీరు సెల్ఫ్​ లవ్​కి ప్రాధాన్యమిచ్చినప్పుడు.. మిమ్మల్ని మీరు ఆరాధించడం నేర్చుకుంటారు. అది చాలా ముఖ్యం. మనలోని మంచి విషయాలు, చెడు విషయాలు మనకు తెలుస్తాయి. అది మనల్ని మరింత మెరుగ్గా మారుస్తుంది. మీరు ఎలా ఉన్నా.. రంగు, రూపం, ఆస్తి, అంతస్థు వంటి విషయాల్లో మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోండి. అదే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది.

మనల్ని మనం ప్రేమించుకోవాలనే వాస్తవాన్ని తెలుసుకుంటే అది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మనకు ఇతరుల నుంచి ప్రశంసలు అవసరం లేదు. మనం ఇతరుల ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం మన సొంత తప్పులను అంగీకరించగలగాలి. మనం ఉన్న విధంగానే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎంత గొప్పగా ప్రేమించినా.. ఎండ్ ఆఫ్ ద డే ఇది మీ లైఫ్. మీకు నచ్చినట్టు ఉంటున్నారా లేదా అనేదే మేటర్. మీరు హ్యాపీగా ఉంటే చాలు. మీరు హ్యాపీగా ఉంటే చాలు మిమ్మల్ని ప్రేమించేవారు కూడా హ్యాపీగా ఉంటారు.

టాపిక్