తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : వెళ్లిపోవాలి అనుకునేవారిని ఎప్పుడూ ఆపకండి.. ఎందుకంటే..

Tuesday Motivation : వెళ్లిపోవాలి అనుకునేవారిని ఎప్పుడూ ఆపకండి.. ఎందుకంటే..

02 August 2022, 8:09 IST

google News
    • Tuesday Motivation : ఎవరైనా మీ లైఫ్​నుంచి వెళ్లిపోవాలి అనుకుంటే వారిని ఆపకండి. ఎందుకంటే వెళ్లిపోవాలి అనుకునేవారితో మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. వారితో కలిసి ఉంటే మీరు ఇంకా ఇబ్బందులను ఎదుర్కోని.. రోజూ బాధపడాల్సి వస్తుంది. వారు మీ లైఫ్​లో నుంచి వెళ్లిపోయారంటే.. వారికంటే మంచిదేదో మీ లైఫ్​లో జరుగుతుందని నమ్మండి. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : కొన్నిసార్లు.. కొన్ని విషయాలు మనల్ని చాలా బాధపెడతాయి. అందులోనూ మనకు నచ్చినవారు మన లైఫ్​నుంచి వెళ్లిపోతే. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. వెళ్లిపోవడమంటే చనిపోవడం లేదా వారు మీ జీవితం నుంచి దూరంగా వెళ్లిపోవాలి అనుకోవడం. చనిపోయి దూరం అయితే చేసేదేమి లేదు. కానీ అలా వెళ్లిపోవాలి అనుకునేవారిని మీరు ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే.. వెళ్లిపోవాలి డిసైడ్​ అయినా వారు ఎప్పటికైనా మిమ్మల్ని ఒంటరిని చేసేస్తారు. ఈ సమయంలో మీరు చాలా బాధపడతారు. మనసుకు కోలుకోలేని గాయం అవ్వొచ్చు కానీ.. మీ లైఫ్​లో వారిని మరిపించే వ్యక్తులు వస్తారని గుర్తించుకోండి. చెడు వెళ్లిపోతేనే.. మంచి వస్తుంది.

ఒక్కోసారి అవతలి వ్యక్తిని మీరు ఎంతగా కావాలనుకున్నా.. ఆపాలి అనుకున్నా సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు వారిని వెళ్లనివ్వడం తప్పా మీకు ఇంకో ఛాయిస్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో స్ట్రాంగ్​గా ఉండండి. వారు వెళ్లిపోతే.. మీకు మంచి లైఫ్ వస్తుందని గుర్తించుకోండి. ఒక ఆకురాలితేనే కదా.. కొత్త చిగురు వచ్చేది. లైఫ్​ కూడా అంతే ఒకరు వెళ్లిపోతేనే కొత్త లైఫ్ వస్తుంది. అది మీకు మరచిపోలేని అందమైన రంగుల ప్రపంచాన్ని ఇస్తుంది.

పోయేవారి గురించి బాధపడటం కంటే.. రేపటి రోజుమీద ఆశతో ముందుకు సాగడం మనకి మంచిది. వారు వెళ్లిపోతున్నందుకు మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవద్దు. మీ జీవితంలో ఉండమని వారిని బతిమాలడాల్సిన అవసరం మీకు లేదు. మీ లైఫ్​ మీకు ఇప్పటికే చాలా ఇచ్చింది. ఫ్యూచర్​లో ఇంకా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలు.. మీరు సక్సెస్ అయినట్లే. అంతేకానీ వారి గురించి ఆలోచిస్తూ.. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి.

మీరు ఎంత ఏడ్చినా.. వెళ్లాలనుకునే వ్యక్తి మీకోసం ఆగరు. ఒకవేళ ఆగిన ఎన్నోరోజులు ఉండరు. ఉన్నా మీరు సంతోషంగా ఉండలేరు. ఇలాంటి టెంపరరీ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ.. మీ సంతోషాన్ని దూరం చేసుకోవడం ఎందుకు చెప్పండి. లైఫ్​లో ఎవరున్నా.. లేకున్నా.. మీరు సంతోషంగా ఉండాలి అనే వాస్తవాన్ని మరచిపోకండి. గో విత్​ ఫ్లో అన్నట్లు జీవితం ముందుకు సాగుతూనే ఉండాలి. ఎవరికోసమో.. ఎవరో వస్తారనో ఆగిపోకూడదు.

వెళ్లిపోయినవారిని పక్కన పెడితే.. మీకోసం ఎదురు చూస్తున్న వారిని మీ లైఫ్​లోకి ఆహ్వానించండి. వెళ్లిపోయిన వారి గురించి ఆలోచిస్తూ.. మిమ్మల్ని, మీరు ఇష్టపడేవారిని బాధపెట్టకండి. మీకోసం ఎదురుచూస్తున్న వారిని మీ లైఫ్​లోకి ఆహ్వానించినందుకు.. ఇప్పుడు కాకపోయినా.. తర్వాత అయినా మీరు మంచి పనిచేశామని హ్యాపీగా ఫీల్ అవుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం